ప్రజల గోడు పట్టని జగన్ ప్రభుత్వం బడుగులకు జనసేన అండ జనసేనకు అవకాశమివ్వండి :కార్మికులతో పితాని బాలకృష్ణముమ్మిడివరం,2022 అక్టోబర్ 1, టుడే న్యూస్:

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా కంటకంగా మారిందని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో వున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ అన్నారు. తాళ్లరేవు మండలంలో నా సేన కోసం-నా వంతు కార్యక్రమంలో భాగంగా ఆయన తాళ్లరేవు మండలం జార్జి పేట, నీలపల్లి , తాళ్లరేవు గ్రామాల్లో పర్యటించి మండల ఒలుపు కార్మిక సంఘం, ఆటో కార్మిక సంఘం, దింపు కార్మికుల సంఘం, కార్పెంటర్  సంఘం, భవన నిర్మాణ కార్మికుల సంఘం మరియు పెయింటర్స్ సంఘం సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని  భరోసా ఇచ్చారు.  ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇప్పించవలసిందిగా వారిని అభ్యర్థించారు.  ఈ సందర్భంగా కార్మికులు వారి సమస్యలు  వర్ణాతీతంగా  ఉన్నాయని వారి గోడును వెళ్ళ బోసుకున్నారు. ప్రభుత్వం నుండి ఏ రకమైన సాయం కూడా ఈ సంఘాలకు అందడం లేదని వాపోయారు.  బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఈ సంఘాల ఆవేదన అద్దం పడుతుందని అన్నారు. ప్రజలను ఉద్దరిస్తున్నట్లు చెప్పుకునే జగన్ ప్రభుత్వం ప్రజలను మాయ మాటలతో వంచిస్తోందని ఆరోపించారు. జనసేన పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని అన్నారు. రాబోవు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  నాయకత్వంలో జనసేన పార్టీ మద్దతు ఇవ్వాలని కోరారు.

 ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు గుద్దటి జమ్మి , మండలాధ్యక్షులు అత్తిలి బాబూరావు, విల్ల వీర, ఉభయగోదావరి జిల్లాల మహిళ కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్లూరి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జక్కం శెట్టి పండు, దూడల స్వామి, కర్ణిడి నాని, గెద్దాడ పండు,దవులూరి శ్రీను, రాయుడు గోవిందు, ఆకేటి రవి, సలాది దుర్గ శ్రీనివాస్,   కడలి కొండ,పాయసం సాయి, పువ్వల జయప్రకాష్ తదితర నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం