సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రసంశనీయం : మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి
*ఘనంగా దసరా సంబరాలు*

విశాఖపట్నం, 2022అక్టోబర్‌2, టుడే న్యూస్ :సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రసంశనీయమని నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ఆదివారం ఇక్కడి ఏయూ అసెంబ్లీ హాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్‌్ట జర్నలిస్టుల అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దసరా సంబరాలను ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేయర్‌ హరి వెంకట కుమారి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి దిక్సూచి లాంటివారని అన్నారు. నగరాభివృద్ధిలో జర్నలిస్టులు అందిస్తున్న సహకారం మరుపురానిదన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్రం నిర్వహించిన స్వచ్చ సర్వేక్షన్‌లో జీవీఎంసీ నాల్గోవ ర్యాంక్‌ రావడంలో నగర జర్నలిస్టులు అందించిన సహకారం మరవలేనిదమన్నారు. గౌరవ అతిథిగా హాజరైన బ్రహ్మణ కార్పరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. పెండింగ్‌ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి  గంట్ల శ్రీనుబాబు, మహా విశాఖ నగర అధ్యక్షుడు పి.నారాయణ్‌లు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా దసరా వేడుకులు నిర్వహిస్తున్నామన్నారు. జర్నలిస్టులు, వారి కుటంబసభ్యులకు అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని వీరు ఆకాంక్షించారు. జర్నలిస్టుల సంక్షేమానికి జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలు నిరంతరం పాటుపడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా అతిధులంతా జర్నలిస్టులు, వారి కుటంబ సభ్యులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ బ్రాడ్‌కాస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు,జిల్లా అధ్యక్షుడు బి. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పి.ఈశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు జి.శ్రీనివాసరావు, నగర కార్యదర్శి అనూ రాధ, ఆయా ప్రాంత జర్నలిస్ట్ నాయకులు పితాని ప్రసాద్. బి. శివ ప్రసాద్, ఎన్. రామకృష్ణ,. సాంబ శివ రావు.. డి. రవి కుమార్, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, బొప్పన రమేష్,

కామాకుల మురళీ కృష్ణ శర్మ, పాత్రుడు, రాంబాబు. తదిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆలరించాయి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు