కళింగ కొయ్య రెడ్ల చరిత్ర పుస్తకావిష్కరణ చేసిన: ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

                                          విశాఖపట్నం,టుడే న్యూస్: ప్రజాసంక్షేమం కోసం ఉత్తరాంధ్ర ప్రాంతంలో తమ ఆస్తులు ప్రాణాలను త్యాగం చేసిన కళింగ కొయ్య రెడ్ల చరిత్రను సమాజం దృష్టికి తీసుకువస్తూ పుస్తకాన్ని రూపొందించిన రచయిత కొయ్య హరి హర రెడ్డి కృషి ఎంతో అభినందనీయమని గాజువాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 12 వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఆసిల్ మెట్ట వేమన మందిరంలో శ్రీ వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన  “త్యాగధనులు కొయ్య రెడ్ల చరిత్ర” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి రచయిత కొయ్య హరిహర రెడ్డి రచించిన “త్యాగధనులు కొయ్య రెడ్ల చరిత్ర” గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కొయ్య రెడ్ల చరిత్ర ఆవిష్కరిస్తూ రచయిత కొయ్య హరి హర రెడ్డి రాసిన పుస్తకం అందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో  వేమన మందిరం, వేమన సంక్షేమ సంఘం అధ్యక్షులు నీలాపు వివేకానంద రెడ్డి, కార్యదర్శి నీలాపు రమణారెడ్డి, రాష్ట్ర రెవిన్యూ సంఘం నాయకులు ఎస్. నాగేశ్వర్రెడ్డి, సత్తి రెడ్డి రామకృష్ణారెడ్డి, మొండి రామకృష్ణారెడ్డి, గొరుసు బాలాజీ రెడ్డి, జి వి ప్రసాద్ రెడ్డి, ఎం శ్రీనివాస్ రెడ్డి, అయ్యప్ప రెడ్డి, దివాకర్ రెడ్డి, ఎం. వి శ్రీనివాస్ రెడ్డి, జి. శ్రీనివాస్, మహిళా న్యాయవాది నీలాపు శకుంతల, మహిళా నాయకులు దొడ్డి సునంద, రచయిత కొయ్య హరి హరి రెడ్డి, కవి, రచయిత మేడ మస్తాన్ రెడ్డి, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి వి ఎస్ కే వరప్రసాద్, నీలాపు రమణారెడ్డి, ఫోటో జర్నలిస్టు ఎం.  శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు