ఓటు హక్కును అమ్ముకోవద్దు*అహింసా విధానంతోనే బంగారు భవిష్యత్‌

*మీడియాకు లక్ష్మణ రేఖ లేదు

*హైకోర్టు పూర్వ  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య

విశాఖపట్నం, 2022 అక్టోబర్‌2,టుడే న్యూస్: సమాజంలో వ్యవస్థలు మారాలంటే ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని, అలా కాకుండా ఓట్లను అమ్ముకుంటే అభివృద్ధి కుంటిపడుతుందని హైకోర్టు పూర్వ  ప్రధాన న్యాయమూర్తి, ఏపీ ఉన్నత విద్యామండలి మెనటరింగ్‌ కమిటీ చైర్మన్‌  జస్టిస్‌ వి.ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం డాబాగార్డెన్స్‌  విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌ల వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్,,  ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో జస్టిస్‌ ఈశ్వరయ్యకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమకాలీన అంశాలపై మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉత్తర భారత దేశంలో ఓట్లు అమ్ముకునే ఆరాచకాలు ఎక్కువుగా జరగుతున్నాయన్నారు.. ప్రజలకు మంచి విద్య,వైద్యం అందించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు. సత్యం,న్యాయం, ధర్మం, అహింసా పద్దతులను పాటించడంతో రానున్న తరాల వారికి బంగారు భవిష్యత్‌ ఉంటుందని, హింసను ప్రొత్సహిస్తే సమాజం అన్ని విధాలా పాడైపోతుందన్నారు.విశ్వగురుగా ఉన్న సనాతన భారత దేశంలో దేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని పతనమయ్యే స్థితికి చేరాయని, భారత దేశం మాత్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. మీడియాను ఎవరూ నియంత్రించలేరనీ, ఇప్పటికే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని జస్టిస్‌ ఈశ్వరయ్య అన్నారు. విజ్ఙత పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాపైనే ఉందన్నారు. మీడియాకు జ్యూడిషియరీతో పాటుగా విశేష అధికారాలున్నాయన్నారు. అంతేకాకుండా సమాచార వ్యవస్థకు సమాజంలో గురుతరమైన బాధ్యత ఉందని, సమాజాన్ని సక్రమ మార్గంలో పెట్టే విధంగా జర్నలిజం ఉండాలన్నారు. సమసమాజ నిర్మాణం సాధ్యం కావాలంటే గాంధీజీ సూచించిన రెండు సూత్రలను అందరూ పాటించాలన్నారు.వశుధైక కుటుంబం కావాలంటే అందరికీ సమాన ప్రాధాన్యత ఉండాలని,అప్పుడే సమాజ ప్రగతి సాధ్యపడుతుందన్నారు.ప్రజాస్వామ్యంలో పాలన విషయంలో అందరికీ తగిన ప్రాతినిధ్యం ఉండాలన్నారు.తాను న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సామాజిక పరిస్థితులను తెలుసుకుని వాటికి అనుగుణంగా పనిచేశానని తెలిపారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కారణంగా ప్రభుత్వంలో ఉన్న వారి కుటంబాలే బాగుపడుతున్నాయని, దిగువ మధ్య ప్రజలు, కార్మికులు ఎక్కడా అభివృద్ధి చెందడం లేదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు , అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున అందరికీ ఉపయోగపడేరితీలో  సందేశాన్నిచ్చిన ఈశ్వరయ్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు, సమాజానికి దగ్గరగా ఉండే వ్యక్తులతో మీట్‌ ది ప్రెస్‌లు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే గాంధీ జయంతి రోజున జస్టిస్‌ ఈశ్వరయ్యను ఘనంగా సత్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్‌ విశాఖ జిల్లా ప్రతినిధి బి. కే. రామేశ్వర.. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గ సభ్యలు పి.వరలక్ష్మీ, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, దోండా గిరిబాబు, సనపల మాధవరావుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం