క్రిబ్కో చైర్మన్ చంద్రపాల్ సింగ్ ని ఢిల్లీలో కలిసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్
డిల్లీ,2022 అక్టోబర్21: క్రిబ్కో చైర్మన్ చంద్రపాల్ సింగ్ ని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ చైర్మన్నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ విశాఖలో పెట్టుబడులకు అనుకూలతకు సంబంధించిన పలు అంశాలను చైర్మన్ కి వివరించారు. గత వారంలో చంద్రపాల్ సింగ్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని సర్వేపల్లి లో ఏర్పాటు కాలనీ క్రిబ్కో బయో విత్తనాలు ప్లాంట్ శంకుస్థాపనకు సీఎం ని ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖపట్నంలో పారిశ్రామిక రంగంగా ఎన్నో అనుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పినాతో పాటు పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం తరుపున వుంటాయని తెలియజేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో చేపడుతున్న నూతన విధానాలను వివరించారు. క్రిభ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తెలిపారు.