జర్నలిస్టులపై దాడుల చేసే వారిని కఠినంగా శిక్షించాలి:హోంమంత్రికి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివ నాయుడు వినతి.
విజయవాడ,2022 అక్టోబర్ 22, టుడే న్యూస్: విశాఖపట్నం జిల్లా గాజువాకలో నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ పత్రిక సంపాదకులు,ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొయిలాడ పరుశురాంపై జరిగిన దాడి కేసులో నింతులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరపు సాంబశివ నాయుడు
హోం మంత్రి తానేటి వనితకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి నేతృత్వంలో శుక్రవారం సాయంత్రం సచివాలయంలోని మంత్రి పేషీలో హోం మంత్రి తానేటి వనితను కలిసి దాడి జరిగిన తీరును వివరించారు.అలాగే ఇటీవల కాలంలో పాత్రికేయులపై ముఖ్యంగా సంపాదకులపై దాడులు ఎక్కువయ్యాయని ఇటువంటి దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షిస్తే ఈ సంఘటనలు తిరిగి పునరావ్రుతం కాకుండా ఉంటాయని రాష్ట్ర అధ్యక్షులు సాంబశివ నాయుడు మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై హోంమంత్రి తానేటి వనిత స్పందిస్తూ నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని పత్రికా సంపాదకులకు, పాత్రికేయులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివనాయుడు మంత్రిని దుశాలువతో సత్కరించి యూనియన్ జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అమరావతి అధ్యక్షులు ఎండి హుమాయూన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖలీల్ రెహమాన్,మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.