సొమ్ము కార్మికులది సోకు జగన్మోహన్ రెడ్డిదా


 *సంక్షేమ బోర్డు నిధులను పక్కదారి పట్టిస్తే ఉద్యమం ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ. రాష్ట్రప్రధాన కార్యదర్శి పడాల.రమణ*

విశాఖపట్నం,2022 అక్టోబర్ 2,టుడే న్యూస్

 రాష్ట్రంలో 50 లక్షల మంది భవన్ నిర్మాణ కార్యాల సంక్షేమ పట్ల ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా* **ఏఐటీయుసిఅనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురుగా "నల్ల జెండాలు చేతబట్టి ధర్నా"* *నిర్వహించి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది*ఈ సందర్బంగా ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి.  పడాల రమణ. మాట్లాడుతూ*. తండ్రిని మించిన తనయుడుగా ఉంటానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి తండ్రి పెట్టిన పథకానికి తూట్లు పొడిచి రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికుల కడుపులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు   దశాబ్దాలు తరబడి భవన్ నిర్మాణ కార్మికుల బదులు కోసం పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996 దేశవ్యాప్తంగా అమలవుతున్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుండి బోర్డు తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది

 కార్మికుల వద్ద నుండి సంక్షేమబోర్డులో సభ్యత్వమని. నిర్మాణ యజమానులు దగ్గర నుండి సెస్ అని వసూలు చేస్తున్న వేల కోట్ల నిధులను *అత్త సొమ్ము అల్లుడు దానం లాగా*   జీవో నెంబర్ 17 ద్వారా ప్రభుత్వం ఇతర ప్రయోజనలు కు మళ్ళించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  కష్టజీవులు పక్షపాతి చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు    

2018 నుంచి ఇప్పటివరకుపెండింగ్ లో ఉన్నటువంటి క్లెయిమ్ వెంటనే విడుదల చేయాలని .ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎర్పాడినప్పటినుంచి భవన నిర్మాణ కార్మికుల ను చిన్న చూపు చూడడమే కాకుండా సంక్షేమ బోర్డునిర్వరం చేయడం జరిగింది.

  మరోపక్కకరోనా వచ్చి భవన నిర్మాణరంగం  కుదెలు అయిపోయి కార్మికులు కుటుంబాలు గడవక పనులు లేక ఇంటి అద్దె కట్టలేక తీవ్ర ఇబ్బందుల అనేకమంది కార్మికులు ఆత్మహత్యలకు గురయ్యారుని కార్మికులం ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి కష్టాన్ని మరింత కష్టంగా వృద్ధి చేసింది. మరోపక్క ఇసుక లేక సిమెంట్ స్టిల్ గృహ నిర్మాణ రా మెటీరియల్ ధరలు ఆకాశాన్నంటాయి. రాష్ట్రంలో సహజ  సంపద అయిన ఇసుక కూడా బంగారం అయిపోయింది గతం లో 6000లుకు దొరికే మూడు టన్నులు ఇసుక ఈరోజు 25,000 అమ్ముతుందని  కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఇసుక ర్యాంపు లు ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వడం వల్ల ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇసుక ర్యాంపులు యజమానులు అట్లా రూపాయలు పడుతున్నారని  *ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన ఉచిత ఇసుక పథకం ఉష్ కాకి అయిపోయిందని అన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వాలు బోర్డు ద్వారా అమలు చేసిన అనేక పథకాలను రద్దు చేయడమే కాకుండా  పని ప్రదేశాల్లోనూ లేబర్ జంక్షన్ లో   వేసవి కాలంలో  కార్మికులకు చలివేంద్రం ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు మంచినీళ్లు బోర్డు ద్వారా సర్ఫరా చేసే వారిని  ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అది కూడా రద్దు చేసింది కార్మికులకు గ్లాసుడు నీళ్లు కూడా ఇవ్వలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భావన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కరించాలని గత మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలనుండి మంత్రుల వరకు ముఖ్యమంత్రి వరకు వినతి పత్రాలు ఇచ్చే ఆందోళన చేస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు  50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు వేల కోట్ల రూపాయల ఆదాయం కలిగిన సంక్షేమ బోర్డు విధివిధానాలపై చర్చించి  పరిష్కారం చేయాలన్న ఆలోచన ప్రభుత్వం యొక్క నియాతత్వం. కార్మిక పట్ల నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు **జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు              కోట సత్తిబాబు మాట్లాడుతూ*  ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1996 చట్టాన్ని గౌరవించి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వాడాలని. గత ప్రభుత్వాలు మాదిరిగే ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సౌకర్యాలను కల్పించాలని.. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను వెంటనే బోర్డుకి జమా చేయాలని. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మిక నిధులను వారి ప్రయోజనక ఖర్చు పెట్టాలని. యజమానులు ఇష్టం సార్ పెంచుకుపోతున్న స్టీలు. సిమెంటు. తదితర రా మెటీరియల్ ధరలను నియంత్రించాలని  లేనిపక్షంలో భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ బోర్డు కాపాడుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో . యూనియన్ నాయకులు కోట సత్తిబాబు కూన కృష్ణారావు. బి శ్రీనివాస్. నామాల రాము. కునా గోపాలం. సన్యాసిరావు. వై.

యస్. మూర్తి పొన్నాడ సాయి. బి ప్రతాప్.నాగేశ్వరరావు. ఎం శ్రీనివాసు. కే లక్ష్మణరావు, నూకరాజు సూరిబాబు ఎల్లాజీ.,తదితరులు పాల్గొనడం జరిగింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు