పోరాట స్ఫూర్తి మూర్తి
*** రుషికొండ, హాయగ్రీవ, దశపల్లా భూములపై ఉద్యమం అభినందనీయం
*** నా సేన నా వంతుగా 20 నెలల గౌరవ వేతనం రూ.1.20 లక్షల చెక్ పవన్ కు అందించిన మూర్తి యాదవ్
*** కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ను ప్రత్యేకంగా సన్మానించిన పవన్ కళ్యాణ్
విశాఖపట్నం, 2022 అక్టోబరు 30, టుడే న్యూస్:
జనసేన పార్టీలో చేరి మహా విశాఖ నగరపాలక సంస్థ కార్పొరేటర్ గా గెలుపొందిన పీతల మూర్తి యాదవ్ విశాఖ భూ కబ్జాలు పై చేస్తున్న పోరాటాలు జనసైనికులకు స్ఫూర్తి కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొనియాడారు. విశాఖలో అరెస్ట్ అయిన జనసైనికుల సంఘీభావ సభలో పవన్ కళ్యాణ్ మూర్తి యాదవ్ ను సన్మానించి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుషికొండ విద్వంసం పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయడం సాధారణం విషయం కాదన్నారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు దశపల్లా, హాయగ్రీవ భూములను సంరక్షణకు పీతల మూర్తి చేస్తున్న ఉద్యమం జనసైనికులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో వందల చెట్లు నరికివేసి పచ్చదనానికి తూట్లు పొడిచి ప్రకృతి వినసానానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏయూలో చెట్ల నరికివేతపై కూడా హైకోర్టులో కేసు వేసి న్యాయపోరాటం చేస్తూ ప్రకృతి ప్రేమికుడుగా నిలిచారని కొనియాడారు. జీవీఎంసీ ప్రజల పై వేసే చెత్త పన్ను , ఆస్తి మూలాధారిత పన్నులపై మూర్తి యాదవ్ అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారన్నారన్నారు.
ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న సైనికులకు, ఉద్యమాలు చేసే మూర్తి యాదవ్ వంటి నాయకులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా
కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తన పదవీకాలం ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు తీసుకున్న 20 నెలల గౌరవ వేతనం లక్షా ఇరవై వేల రూపాయల చెక్ ను నా సేన నా వంతుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు విరాళంగా అందించారు.
విశాఖపట్నంలోని పార్టీ కార్పొరేటర్ నుండి ఈ రకమైన విరాళం ఇది మొదటిదని పార్టీ ప్రతిష్ట, పటిష్ట కోసం మూర్తి యాదవ్ చేస్తున్న నిరంతర పోరాటం, సేవా స్ఫూర్తి కి సంతోషం వ్యక్తం చేశారు. పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ జనసేన సైనికుడుగా పార్టీ అధ్యక్షుడు ఆలోచన విధానాన్ని అమలు చేయడం తన ప్రధమ కర్తవ్యమన్నారు. అలాగే విశాఖపట్నంలో ప్రభుత్వ భూములు కాపాడడం విశాఖ పౌరుడుగా తన బాధ్యతన్నారు. నగరేతర నాయకులు విశాఖ వచ్చి ఇక్కడ రాజకీయంగా ఎదిగు విలువైన భూములు దోచుకుకుంటున్నారన్నారు. మంచితనంతో ఆదరిస్తే నగర ప్రజల ఆస్తులనే కొల్లగొడతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ భూముల పై కన్నేసి రాజకీయ నాయకులకు ఇక్కడ రాజకీయ భవిష్యత్ లేకుండా ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు.