అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు


 విశాఖపట్నం,2022 అక్టోబర్ 18,  టుడే న్యూస్:  54వార్డు గడప గడపకు ప్రభుత్వము కార్యక్రమంలో కె కె రాజు  

గడపగడపకు  ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 54వార్డు శివానిపాలెం-4 సచివాలయం *1086308* 104ఏరియా,బాపూజీ నగర్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె.కె రాజు 5

4వార్డు కార్పొరేటర్ చల్లా రజిని,ఈశ్వరరావు తో కలిసి పర్యటించారు.ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.


ఈ సందర్భంగా కె.కె రాజు  మాట్లాడుతూ ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు, చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమం చేపట్టారని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా ప్రజా ప్రతినిధులు తెలుసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని తద్వారా ఆయా సమస్యలను పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,జోనల్ కమిషనర్ ఆర్.జి.వి క్రిష్ణ,మాజీ కార్పొరేటర్ కె.వెంగలరావు,వార్డు అధ్యక్షులు నీలి రవి,కె.పి రత్నాకర్,డైరెక్టర్లు ఆళ్ల శివగణేష్,కాయిత వెంకటలక్ష్మీ,రాయుడు శ్రీను,54 వార్డు నాయకులు కడితి చిరంజీవి,అచ్చుతరావు,కె.రమణ బాబు,ఎన్.శంకర్,దిలీప్,జి.లక్ష్మి రెడ్డి,సారిపల్లి జగదీష్,రాధాకృష్ణ,పల్లా సోమేశ్,పి.శివ,సీనియర్ నాయకులు షేఖ్ బాబ్జి,కె.చిన్నా,సునిల్,సాధర్మజ్ఞానేశ్,కృపా,వై.వరలక్ష్మీ,బాపూజీ నగర్ పెద్దలు,సచివాలయంసిబ్బంది,వాలంటరీ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*