ప్రజారవాణా వాహనాల్లో జీవీఎంసీ కార్యాలయానికి చేరుకున్న :నగర మేయర్
విశాఖపట్నం,2022అక్టోబర్ 17, టుడే న్యూస్:కాలుష్య నియంత్రణ లో భాగంగా మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోనికి ఎటువంటి వాహనాలకు అనుమతి లేనందున నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సోమవారం ఉదయం ఆరిలోవ లోని క్యాంప్ ఆఫీస్ నుండి నడుచుకుంటూ అక్కడకు దగ్గరలో ఉన్న బస్టాప్ కి చేరుకొని బస్సులో ప్రయాణించి మహా విశాఖ నగరపాలక సంస్థ మున్సిపల్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు