*పథకాల డబ్బులు జగన్‌వా ? ప్రజలవా ? అంతా “ధర్మవరం” చర్చే ..!*

 

*పథకాల డబ్బులు జగన్‌వా? ప్రజలవా ? ఇప్పుడీ చర్చ ఆన్ లైన్, ఆఫ్‌లైన్‌లోనూ సాగుతోంది . దీనికి కారణం ధర్మవరం నియోజకవర్గంలో శివయ్య అనే టీడీపీ కార్యకర్త ధైర్యం..*

*ఆ తర్వాత ఆ ధైర్యాన్ని దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు ఆడుతున్న నాటకాలు రివర్స్ కావడం. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతున్నారు. అందులో భాగంగా ఓ ఇంటికెళ్లారు.*

*ఆ ఇంటిపై టీడీపీ జెండా ఉండటంతో పథకాలు వద్దా .. అని బెదిరింపు ధోరణితో మాట్లాడారు. వద్దులే పో అన్నారు వాళ్లు. దీంతో కేతిరెడ్డి వారికి పథకాలు తొలగించు అని వాలంటీర్‌కు చెప్పారు.*

*అక్కడ నువ్ టీడీపీ కాబట్టి పథకాలు ఇవ్వం అని చెప్పడం హైలెట్ అయింది. అలాగే పథకాల కోసం పార్టీ మారం అని టీడీపీ కార్యకర్త చెప్పడం ఇంకా హైలెట్ అయింది.*

*అదే సమయంలో అర్హత ఉన్నప్పటికీ టీడీపీ అని పేరు చెప్పి అతని పథకాలు తొలగించాలని చెప్పడం ద్వారా ఎమ్మెల్యే మాత్రమే కాదు వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న కులం చూడం , మతం చూడం, పార్టీ చూడం అనే మాటలు ఫేక్ అని నిరూపితమయింది.*

ఇంత కాలం టీడీపీ నేతలు చెబుతూ వస్తున్న వాటికి బలమైన ప్రతిపతిక లేదు. కనీ ఓ టీడీపీ కార్యకర్త చూపిన తెగువతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సర్టిఫికెట్స్‌లాగాస్ట్రాంగ్‌గా వైసీపీ నేతల పార్టీయాలిటీ బయట పడింది.

నిజానికి ప్రభుత్వం ఆ లబ్దిదారులకు అర్హత ఉందనే ఇస్తోంది. ప్రభుత్వం పెట్టో సవాలక్ష నిబంధనలకు అనుగుణంగా ఉండటంతోనే ఏమైనా పథకాలు వచ్చి ఉంటే వచ్చి ఉంటాయి.

అదేమీ జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదు. ప్రజలు పన్నులుగా కట్టిందే. జగన్ అప్పులు చేసి పంచి ఉంటే.. అవి ప్రజల పన్నులతోనే కట్టాలి. అదేదో తమ దయాదాక్షిణ్యాలతో ఇస్తున్నట్లుగా ఏ ప్రభుత్వమూ ఓవరాక్షన్ చేయలేదు.

ఇప్పటి వరకూ వచ్చే ప్రతి ప్రభుత్వంలో పెన్షన్లు ఉన్నాయి. .. పథకాలు ఉన్నాయి. కొత్తగా వస్తున్నదేమీ లేదు. కానీ చాలా పథకాలు ఆగిపోయాయి. జీవన ప్రమాణాలు పడిపోయాయి.

ఇప్పుడు ఆ టీడీపీ కార్యకర్తలకు పథకాలు ఆపేస్తే నైతికంగా వైసీపీ పతనం అవుతుంది. ఇలాంటి పతనం ప్రారంభమైతే ఎవరూ ఆపలేరు. కొసమెరుపేమిటంటే వైసీపీ నేతలంతా..

*అతనికి గత మూడేళ్లలో 90వేల లబ్ది కలిగించామంటూ ఓ పత్రం వైరల్ చేస్తున్నారు. అంటే ఏడాదికి ముఫ్ఫై వేలు… నెలకు రూ. రెండు వేలకు కాస్త ఎక్కువ. మెనిఫెస్టోలో పెట్టింది…*

*ఏడాదికి రూ. ఐదు లక్షల వరకూ లబ్ది అని. ఈ తేడాలన్నీ ప్రజలకు తెలియవని .. అనుకోవడానికి లేదు. అప్పుడప్పుడు ధర్మవరం వంటి ఘటనలతో అన్నీ బయటకు వస్తూంటాయి...*

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం