డా. ఎం.ఆర్.ఎన్.వర్మకు అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు


విశాఖపట్నం, 2022 అక్టోబర్ 21, టుడే న్యూస్: మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం 91వ. జయంతోత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలోని సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డును ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు డా. ఎం.ఆర్.ఎన్.వర్మకు ప్రకటించారు. డా. వర్మతోపాటు మరో నలుగురికి ఈ అవార్డు ప్రధానం చేస్తున్నట్టు సంకల్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్.రాజారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న ఉదయం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖా మంత్రి ఆర్కే రోజా, ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు గౌరవ అతిధులుగా హాజరు కానున్నట్టు రాజారెడ్డి తెలిపారు. వివిధ రంగాల్లో సేవలందించిన వారిని సత్కరించడం, నిస్వార్ధ సేవలను గుర్తించడం ద్వారా సంకల్ప సేవా సమితి ప్రతిష్టాత్మకమైన సేవా సంస్థగా

పేరొందింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం