విశాఖలో సీఎం జగన్ కి ఘన స్వాగతం పలికిన నగర మేయర్
విశాఖపట్నం 2022 నవంబర్ 23,టుడే న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ నుండి విశాఖ చేరుకున్న సందర్భంగా మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విశాఖ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయంలో నగర మేయర్ తో పాటు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ కర్ణం ధర్మ శ్రీ, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, బి.వి. సత్యవతి, జి.మాధవి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున, విఎంఆర్డిఏ చైర్ పర్సన్ అక్రమాన్ని విజయనిర్మల, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ రాజబాబు తదితరులు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరారు.