*అక్కయ్యపాలెంలో అయ్యప్ప అంబలం పూజ*



*శ్రీధర్మశాస్ర్త పీఠం ఆద్వర్యంలో నిర్వహణ*

,*శరణఘోషతో అయ్యప్పను కీర్తించిన స్వాములు*


అక్కయ్యపాలెం, 2022నవంబర్ 20టుడే న్యూస్: 

అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి (మహారాణిపార్లర్ వద్ద)లో ఆదివారం రాత్రి అయ్యప్ప అంబలం పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు.శ్రీధర్మశాస్ర్త పీఠం ఆధ్వర్యంలో  మొల్లేటి రామారావు సమక్షంలో నిర్వహించారు.  ఈ పూజలో పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని దేవతా మూర్తులను కీర్తించారు. తొలుత 

వినాయకుడు, లక్ష్మీదేవి, అయ్యప్పలను శాస్ర్తోక్తంగా పూజించారు. అనంతరం స్వాములంతా భక్తిపాటలతో అయ్యప్పను ప్రార్ధించారు. ఈ సందర్భంగా పలువురు స్వాములుతో పాటు ఇతరులు కూడా పూజలో పాల్గొని అయ్యప్ప ప్రసాదం స్వీకరించారు. వీరుమామ , రావు, ఉదయ్ కొల్లితో పాటు అనేక మంది పీఠం సభ్యులు సేవలందించారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అయ్యప్పను పూజించారు. ఈ సందర్భంగా పీఠం సభ్యులు శ్రీనుబాబును ఘనంగా సత్కరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం