అవంతి కళాశాలలో సృజన 2K22 సాంకేతిక ప్రదర్శన

 



 విశాఖపట్నం,2022 డిసెంబర్ 29,టుడే న్యూస్:  స్థాన అవంతి కళాశాలలో సృజన 2K22 పేరుతో రెండు రోజులు పాటు సాంకేతిక నమూనాల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిధులుగా విశాఖపట్నం గవర్నమెంట్ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి రమణ  రాంకో సిమెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అనకాపల్లి  సిహెచ్ . సుబ్బారావు  హాజరయ్యారు. విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుటకు సాంకేతిక అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు డాక్టర్ కె.వి.రమణ  సిహెచ్ సుబ్బారావు గ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి .మోహన్ రావు  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు

 ముఖ్య అతిథులు డాక్టర్ కె.వి రమణ మాట్లాడుతూ విద్యార్థులలో లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్ , మ్యాథమెటిక్స్ నందు ప్రావీణ్యం సాధించడం ద్వారా పిల్లల్లో సాంకేతిక నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చునని తెలిపారు. గణితం, సైన్స్ శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించడం తో పాటు పాటు వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయవచ్చునని తెలిపారు

రాంకో సిమెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిహెచ్ సుబ్బారావు  మాట్లాడుతూ మనకు లభించే వనరులు పరిమితం కాబట్టి వనరులను సమర్దవంతంగా ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గించవచ్చని, ముఖ్యమైన వనరులైన డబ్బు, ముడుపుదార్థాలు మరియు యంత్రాలను సమర్ధవంతంగా ఉపయోగించడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చు అని తెలిపారు. మనం చేసే ప్రతి పని ప్రణాళికతో చేయాలని సూచించారు

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి మోహనరావు మాట్లాడుతూ సాంకేతిక నమూనాల ప్రదర్శన ద్వారా విద్యార్థులలోనీ సాంకేతిక నైపుణ్యాన్ని వెలికి  తీయగలమని, ప్రతి విద్యార్థి హార్డ్ వర్క్ చేయడం ద్వారా ఫలితాలను సాధించవచ్చు అంతేకాక స్మార్ట్ వర్క్ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను తక్కువ సమయంలో సాధించవచ్చని తెలిపారు.

 అవంతి కళాశాల వివిధ శాఖధిపతులు మాట్లాడుతూ సాంకేతిక ప్రదర్శన ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించవచ్చని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి వివరించారు.

 ఈ సాంకేతిక ప్రదర్శనకు వివిధ  కళాశాలలు, పాఠశాల నుండి విద్యార్థులు తయారు చేసిన సాంకేతిక నమూనాలను నమూనాల ప్రదర్శనకు ఆహ్వానించారు. ఉత్తమ నమూనాలకు బహుమతులు ప్రధానం చేయనున్నారు.

 అవంతి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు సుమారు 40 సాంకేతిక నమూనాలను ప్రదర్శన లో ఉంచారు, మరియు సుమారు 15 పాఠశాల నుంచి 1200 మంది విద్యార్థులు ఆయా పాఠశాల నుండి 70 సాంకేతిక నమూనాలను ప్రదర్శనలో ఉంచడం జరిగింది. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి మోహన్ రావు  ముఖ్య అతిధులను సాలువతో సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ . ప్రసాద్ రావు , కన్వీనర్ డాక్టర్ కె.గోవింద  ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ టి శ్రీనివాసరావు  వివిధ శాకాధిపతులు, అధ్యాపకులు మరియు ఏవో డానియల్ రాజు  ఆఫీస్ సిబ్బంది హాజరయ్యారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం