కొత్తవారికి స్వాగతం..పాతవారికి ఆహ్వానం కొత్త, పాతల చేరికలతో టిడిపి పునర్నిర్మాణం -కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పిలుపు
 హైదరాబాద్,2022 నవంబర్ 30,టుడే న్యూస్ :  ‘‘కొత్తవారికి స్వాగతం, పాతవారికి ఆహ్వానం..కొత్త, పాత కలయిక, చేరికలతో టిడిపిని పునాదులనుంచి పటిష్టం చేయనున్నట్లు’’ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

 బుధవారం ఎన్టీఆర్ భవన్ లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున చేరికల సందర్భంగా మాట్లాడారు. కొత్తగా పార్టీలో చేరిన పెద్దపల్లి నాయకులకు పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ, ‘‘రాబోయే ఎన్నికలకు ఇప్పటినుండే పార్టీని క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో పోటీకి అభ్యర్ధులను ఇప్పుడే ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. వార్డు, డివిజన్, సర్పంచి, ఎంపిటిసి, జడ్ పిటిసి అభ్యర్ధులే రాబోయే రోజుల్లో పార్టీకి సైనికుల్లాగా ముందుండి నడిపిస్తారని అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని, ప్రజాందోళనలతోనే ప్రజలకు దగ్గర కావాలని సూచించారు.

పెద్దపల్లి బీసి సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సిరవేణ స్వప్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరినవారిలో కలవేణ రాజయ్య, కొండముది వెంకటేశ్, సొల్లు రంజిత్, సునీత, కొండముది శ్రీలత, కంది సరిత, కవిత, నర్రా సాగర్, చిలకల రాజ్ కుమార్, నర్రా నరేష్, మేకల సతీశ్, మేకల నాగరాజు, కోమల, విజయ తదితరులు ఉన్నారు. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*