శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి సేవలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, పద్మజ దంపతులు




విశాఖపట్నం, 2022 డిసెంబర్ 1, టుడే న్యూస్: మార్గశిర మాసొత్సవాలు లో  సందర్భంగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, పద్మజ దంపతులు శ్రీ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి గర్భాలయంలో విశేష పంచామృత అభిషేకం తో పాటు,  ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి ప్రత్యేక పూజ అనంతరం వేద పండితులు ఆశీర్వాదం చేసి, తీర్థ ప్రసాదములు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన సదుపాయాలు కల్పించారాని, ఈ సంధర్బంగా  ఆలయ సిబ్బందిని ,ధర్మకర్తల మండలి చైర్ పర్సన్, సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఈవో శిరీష గారు, ధర్మకర్తల మండలి చైర్పర్సన్ శ్రీమతి కొల్లి సింహాచలం గారు, ఏ ఈ ఓ రాంబాబు గారు ,ధర్మకర్తల మండలి సభ్యులు అనురాధ గారు, శ్రీ సుబ్రహ్మణ్యం గారు, సురేష్ గారు, మారుతి ప్రసాద్ గారు, ధన లతా గారు తో పాటు పలువురు సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.```

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం