పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదే లేదు: జివిఎంసి కమిషనర్ పి రాజా బాబువిశాఖపట్నం,2022 డిసెంబర్ 29,టుడే న్యూస్ :

పారిశుధ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే  ఉపేక్షించేదే లేదని జివిఎంసి   కమిషనర్ పి రాజా బాబు శానిటరీ ఇన్స్పెక్టర్లను హెచ్చరించారు. గురువారం ఆయన  జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని  సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్జి శాస్త్రి, ఏఎంఓహెచ్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరమని ఎంతోమంది పర్యాటకులు నగరానికి వస్తుంటారని  నగరాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత శానిటరీ ఇన్స్పెక్టర్ల దేనిని, పారిశుద్ధ్య పనులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యర్ధాలు పడే  ప్రతి మూలాలు మీకు తెలిసని ప్రతి రోజు రెండు మూడు గంటలు శ్రమిస్తే నగరంలో చెత్త కనిపించదని, పిన్ పాయింట్ వారీగా పారిశుద్ధ కార్మికులని సర్దుబాటు చేసి నిర్ణీత సమయానికే వ్యర్ధాలు తొలగించాలని ఆదేశించారు. ప్రతి రోజు శానిటరీ కార్యదర్శులతో సమీక్షించి ఆయా ప్రాంతాలలోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు  తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. యూజర్ చార్జీలు మందకొడిగా వసూల్ అవుతున్న దృష్ట్యా వసూలు వేగవంతం చేయాలని, ప్రతి ఇంటి నుండి నిర్ణయించిన యూజర్ చార్జీలను వసూలు అయినట్లయితే జివిఎంసి నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉండదని, ఆ సొమ్మును మౌళిక వస్తువులు కల్పనకు ఉపయోగిస్తామని, అలాగే తడి-పొడి చెత్త నిర్వహణ జరిగే విధంగా చూడాలని, క్లాప్ వాహనాలను ఆ వాహన డ్రైవర్ల చే  శుబ్రపరచి, వాహనం నుండి దుర్వాసన రాకుండా చూడవలసిన బాధ్యత శానిటరీ ఇన్స్పెక్టర్ల దేనిని కమిషనర్ తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యతతో విధులు నిర్వర్తిస్తే ఆ ఘనత మీతో పాటు జివిఎంసి యంత్రాంగంపై ఉంటుందన్నారు. నిషేధిత ప్లాస్టిక్ దుకాణాలలో అమ్మకుండా తనిఖీలు  నిర్వహించాలన్నారు. ట్రేడ్ లైసెన్సులు ప్రతి దుకాణదారుడు కలిగి ఉండే విధంగా చూడాలని, సచివాలయ  పరిధిలోని ఎన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయో వారందరికీ ట్రేడ్ లైసెన్స్ లు ఉన్నాయా... లేవా... అని తనిఖీలు నిర్వహించాలన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*