మీజోరామ్ గవర్నర్ కంబంపాటి హరిబాబు చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న కోనేటి ఆదినారాయణ
విశాఖపట్నం, 2022 డిసెంబర్12(టుడే న్యూస్):
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వివేకానంద స్కూల్ లో రాష్ట్ర కార్యాలయం తన సొంత నిధులుతో రాష్ట్ర చైర్మన్ కె.ఎస్.ఎన్ మూర్తి నిర్మించిన భవనంకు మీజోరామ్ గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, అప్స రాష్ట్ర సెక్రటరీ మురళి మనోహర్ పాల్గొని భవనం ప్రారంభంచడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్రములో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులలో చక్కని ప్రతిభ కనబరిచిన అలాగే బ్లడ్ డొనేషన్ లో 65 మార్లు పూర్తి చేసిన యూనిక్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కోనేటి ఆదినారాయణ కి రాష్ట్ర ఉత్తమ సేవా పురస్కారంను మీజోరామ్ గవర్నర్ కంబంపాటి హరిబాబు చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా గవర్నర్ ఆదినారాయణ ని ప్రత్యేకముగా అభినందనలు తెలియజేసారు. 100 మార్లు పూర్తి చేయండి అని ఆకాంక్ష తెలియజేసారు. ఆదినారాయణ మాట్లాడుతు ఇంత చక్కని అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది అని ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తానని అందరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.