నడస్తూ..బస్కెక్కి..జీవీఎంసీకి చేరుకున్న మేయర్‌


విశాఖపట్నం,2022 డిసెంబర్‌ 19, టుడే న్యూస్ : మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి నడుస్తూ..బస్కెక్ని ప్రయాణికులతో ముచ్చటిస్తూ అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. వారానికోరోజైనా జీవీఎంసీ ఉద్యోగులు తమ సొంత వాహనాలు వదిలి ప్రజా రవాణా వ్యవస్థనే ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునివ్వడమే కాదు పాటిస్తున్నారు కూడా. సోమవారం ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి బస్టాపు వరకు నడుచుకుంటూ వెళ్లి ఆ తర్వాత ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించి అనంతరం జీవీఎంసీ కార్యాలయానికి చేరుకుని ‘స్పందన’లో పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణకు నగర వాసులు సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఆమె వెంట వైసీపీ సీనియర్‌ నేత గొలగాని శ్రీనివాసరావు ఉన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం