శాంతి ఆశ్రమంలో ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్న హృదయాలయం ఫౌండేషన్, వైఎస్ఆర్సిపి నాయకురాలు : డాక్టర్ రమ్యశ్రీ
విశాఖపట్నం,2022 డిసెంబర్ 21, టుడే న్యూస్: లా సన్స్ బై లో గల శాంతి ఆశ్రమంలో 200 మంది చెవిటి మూగ పిల్లల మధ్య, గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రమ్య హృదయాలయం ఫౌండేషన్ తరపున డాక్టర్ రమ్యశ్రీ, వైయస్సార్సీపి నాయకురాలు ఘనంగా వాళ్ళందరి మధ్య కేక్ కట్ చేసి చాక్లెట్లు కేక్స్ బిస్కెట్స్, ఆశ్రమ పిల్లలకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అన్న పుట్టినరోజు ఇలాంటి వాళ్లు మధ్య జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలియజేయడం జరిగింది అలాగే ఆగస్టు 15న తన పుట్టినరోజు వేడుకలు కూడా గత 15 సంవత్సరాలుగా ఇలాంటి వాళ్ళ మధ్య జరుపుకుంటూ ఉంటానని తెలిపారు,అలాగే విశాఖపట్నం వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో గౌరవనీయులైన విశాఖపట్నం మేయర్ గొలగాని వెంకటలక్ష్మి తో డాక్టర్ రమ్యశ్రీ వైఎస్ఆర్సిపి నాయకురాలు ఎంతోమంది నాయకులు కార్యకర్తలు మధ్య రక్తదాన కార్యక్రమాన్ని జరపడం ఆనందంగా ఉందని, ఈరోజు జరిగే అనేక కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు .