ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు చేరాలి: కె కె రాజు
విశాఖపట్నం,2022 డిసెంబర్30 టుడే న్యూస్:ము  ఖ్యమంత్రిగా  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  బాధ్యతలు స్వీకరించిన అనంతరం పేద ప్రజలకు చేయూతనిచ్చే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రూపకల్పన చేశారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్  కె కె రాజు అన్నారు. ఈమేరకు ఈరోజు 55 వవార్డు కార్పొరేటర్ శశికళ  ఆధ్వర్యంలో శుక్రవారం  నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో   కె కె రాజు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అందుతున్న తీరును స్థానికులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం లో ప్రజల నుండి స్వీకరించిన వి నతులను తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈసందర్బంగా కె కె రాజు గారు మాట్లడుతూ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు.అదే విధంగా అభివృద్ధి విషయంలో ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులకు సంబంధించి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  పాలనలో విశాఖ నగరం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళా సాధికారత, విద్య, ఉపాధి తదితర వాటిపై దృష్టి సారించి ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  సుపరి పాలన అందిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో 42 వార్డు కార్పొరేట్ ర్ ఆళ్ళ లీలావతి,శ్రీనివాస్, డైరెక్టర్ రాయుడు శ్రీను,యన్. రవి కుమార్,సకలబత్తులప్రసాద్,రత్నాకర్,దుప్పల పూడి శ్రీను,పైడి రమణ,గంగ మహేష్, యరంశెట్టి శ్రీనివాస్,ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, చిన్న రావు, లక్ష్మి, వరలక్ష్మి, సురేష్, జామిదాస్, జె.శ్రీనివాస్ రెడ్డి, యం.డి.గౌస్,ఆళ్ళగోపి,సంతోష్,పరదేశి రెడ్డి,సీనియర్ నాయకులు, హరి పట్నాయక్, కె వి బాబా,షేక్ బాబ్జి,తిరుమల రావు,గాలి ప్రసాద్,సీపాన రాము,గోపి,సమెట్ల వెంకటేష్, నాయుడు, దుర్గ,మరియు అధికారులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*