సినీ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్ : దిగ్గజ సినీ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  కాసాని జ్ఞానేశ్వర్ .. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు  రావుల చంద్రశేఖర్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ టిడిపి పార్టీ వ్యవహారాల ఇంచార్జ్  టిడి జనార్దన్ రావు  సంతాపం ప్రకటించారు. ఈ మేరకు దివంగత నటుడు పార్థివ దేహాంపై  పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.  సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  ఈ సందర్భంగా  కాసాని జ్ఞానేశ్వర్  వెంట తెలంగాణ టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు  జ్యోస్న, నేతలు  కాసాని వీరేశ్, రఘు, షరీఫ్ తదితర టీడీపీ నేతలు దివంగత నటుడు సత్యనారాయణ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*