సామ్రాజ్యవాదానికి మతోన్మాదం తోడైతే ప్రమాదకరం.

 

 యుపిఎస్సి మాజీ సభ్యులు, మాజీ వైస్ ఛాన్సలర్ ,

ప్రొఫెసర్ కెఎస్ చలం.

 మనదేశంలోని లౌకిక మూలాలు అశోకుని కాలం నుంచీ ఉన్నాయి. తన రాతి శాసనాల్లో అందరినీ సమానంగా చూడాలని ఆదేశాలూ ఉన్నాయి. మనుషులంతా ఒక్కటే అనే నినాదం పురాణకాలంలోనూ విస్తరించింది. 1991లో ఆర్థిక సామ్రాజ్యవాద విధానంతో పాలకులు అనుసరించిన సంస్కరణలు కొంత మేర దేశ లౌకిక మూలాలను దెబ్బతీశాయని చెప్పవచ్చు. ఓ పక్క ఈ ప్రమాదకర సంస్కరణలపై దేశ ప్రజల్లో ఆందోళన కొనసాగుతున్న క్రమంలో 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఈ దేశంలో లౌకిక వాదానికి పెద్ద ప్రమాదం దాపురించింది. ఇది యాధృచ్చికమా? లేదా కావాలని చేశారా? అనే అంశాన్ని పరికించి చూస్తే.. ఆ రోజు  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి. దేశంలోని హిందూత్వ శక్తులు ఈ రోజును ఎంచుకుని బాబ్రీ విధ్వంసానికి పాల్పడడం దేశంలోని ప్రజలంతా విస్మయానికి గురైన సంగతిని నేటికీ మరచిపోలేము. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, కావాలని చేశారా అన్నది రూడి నేర్చుకోవచ్చు. ఇంతవరకూ ఈ విధ్వంసంపై చాలా విశ్లేషణలూ వెలువడ్డాయి. హిందూత్వ మూకలు పని గట్టుకుని బాబ్రీ మసీదును నాశనం చేసి తమ అజెండా అమలుకోసం నాటినుంచీ ప్రయత్నిస్తున్నారు. ఆనాటి నుంచీ ఈ దేశం హిందూత్వం వైపు పయనించేలా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరహా దుర్మార్గ ఘటనలు మనదేశంలో ఎక్కడా సరిగ్గా లిఖించబడకపోవచ్చు. మానవ నాగరికతను మరింత వెనక్కి నెట్టే చర్యలపై మేధావి వర్గం నోరుమెదపాలి. ఆర్థిక సామ్రాజ్యవాదం ఒకవైపు, మతోన్మాదం మరోవైపు భారతదేశ మూలాలపై దాడులు చేస్తూ ప్రజలను, వ్యవస్థలను తీవ్ర అవస్థలకు గురిచేయడం అందరూ ఖండించాల్సిన విషయం. లౌకిక వాదులు ఈ అంశాలపై ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. భవిష్యత్లో ప్రమాదకర పోకడలు పెరగకుండా అభ్యుదయ శక్తులు కలసికట్టుగా పునరేకీకరణ కావాల్సిన అవసరం  ఉందని ఆచార్య కె యస్.చలం ఓ ప్రకటనలో  తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం