*శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము*




 తిరుపతి,2022, డిసెంబర్ 5, టుడే న్యూస్: భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం మధ్యాహ్నం  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారినిదర్శించుకున్నారు.  ఆలయం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో  ఎవి ధర్మారెడ్డి, జేఈవో లు   సదా భార్గవి , శ్వరబ్రహ్మం సివిఎస్వో  నరసింహ కిషోర్ పుష్పగుచ్ఛాలు అందించిస్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గౌరవ రాష్ట్రపతి  ఆలయంలోని  ధ్వజస్తంభానికి  మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ,ఈవో  ఎవి ధర్మారెడ్డి  గౌరవ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతోసత్కరించారు.ఉపముఖ్యమంత్రులు  నారాయణ స్వామి , సత్యనారాయణ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర మంత్రి  ఆర్ కె రోజా , జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి , జిల్లా ఎస్పీ  పరమేశ్వర రెడ్డి , చెన్నె టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్  శేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు , ఆలయ డిప్యూటీ ఈవో   లోకనాథం, ఆగమ సలహా దారు    శ్రీనివాసాచార్యులు, అర్చకులు  బాబు స్వామి,  మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నరు 

     దర్శనం బాగా జరిగిందని గౌరవ రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అయిన గౌరవ రాష్ట్రపతి చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి లతో మాట్లాడుతూ తిరుమల, తిరుచానూరులో దర్శనం ఏర్పాట్లు బాగా ఉన్నాయని సంతోషంగా చెప్పారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం