తెలంగాణ టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాళ్లు ఎక్సైజ్ కమీషనర్ కి వినతీ పత్రాన్ని సమర్పించారు .

  హైదరాబాద్,2022, డిసెంబర్ 5, టుడే న్యూస్ :  తెలంగాణ ప్రభుత్వం నేడు రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చి అమాయకుల నుండి అధిక ధరలు వసూలు చేస్తూ ఆదాయ వనరులను సమకూర్చుకుంటుంది అని మరియు మహిళల పై జరుగుతున్న అత్యాచారాలు కూడా మద్యం మత్తుతో బానిసలుగా మారుతున్నారని మరియు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చాల విడిగా దొరకటం తో యువత తప్పుడు మార్గంలోకి వెళుతున్నారని మొదలగు సమస్యలను ఎక్సైజ్ కమిషనర్ గారి కి తెలియచేస్తూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.  అందుకు కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ డీసీపీ మరియు ఏసీపీ గారికి కూడా వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమములో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి షకీలా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అన్నపూర్ణ మరియు ప్రతిభ, రాష్ట్ర తెలుగు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత, కాయనిర్వహక కార్యదర్శి శాంతి, కార్యదర్శి శశిరేఖ, లీగల్ సెల్ విభాగం లీలపద్మావతి, కార్యకర్తలు లలిత, ప్రశాంతి లక్ష్మి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం