జగనన్న జన్మదినన్న రక్తదాన శిబిరంలో పాల్గొన్న నగర మేయర్, తూర్పు సమన్వయకర్త





 విశాఖపట్నం,2022 డిసెంబర్ 21, టుడే న్యూస్: అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె ఎంవిపి కాలనీ వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినo సందర్భంగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాన్ని విజయనిర్మల ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, కేక్ కటింగ్ చేశారు

 ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ జనహృదయనేత జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని  లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని, రక్తదానం వలన పదిమంది ప్రాణాలను కాపాడుగలుగుతామని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారని, వారందరికీ ఆమె కృతజ్ఞత తెలుపుతూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రాష్ట్రాన్ని మరో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు అక్రమాన్ని రోహిణి, గేదెల లావణ్య, నక్కేల లక్ష్మి సురేష్ కెల్లా సునీత, మాజీ కార్పొరేటర్ జగ్గుపిల్లి అప్పలరాజు, 28వ వార్డ్ ఇంచార్జ్ పల్లా దుర్గారావు, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు బోని శివరామకృష్ణ, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 అనంతరం ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ స్వగృహంలో జగనన్న పుట్టినరోజు వేడుకలలో పాల్గొని కేక్ కటింగ్  చేశారు. అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలు ప్రజలకు మిఠాయిలు పంచి అనంతరం బాణా సంచులు కాల్చారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు ఇన్చార్జ్ పీతల గోవింద్, 28వ వార్డు ఇంచార్జ్ పల్లా దుర్గారావు, పలక రవి, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం