ఎస్సిపిసీఆర్ ఆదేశాలు అమలు చేసిన కనక మహాలక్ష్మి దేవస్థానం


  విశాఖపట్నం,2022, డిసెంబర్ 5, టుడే న్యూస్: మార్గశిర  మాసోత్సవాలు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది భక్తులు,వేలాదిమంది పిల్లలు, బాలింతలు కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకుంటున్న సందర్భంగా పిల్లల హక్కుల పరిరక్షణలో భాగంగా వారి తల్లిదండ్రులకు ఉపయుక్తంగా ఉండేలా దర్శన క్యు లైన్లలో తల్లులు పాలు పెట్టడానికి తగినన్ని ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని,పిల్లలకు పాలు,ఆహార పదార్థాలు అందించడంతో పాటు తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో పాటు మరిన్ని  సౌకర్యాలు కల్పించాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి శిరీష దృష్టికి,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొస్తూ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీచేశారు,ఈ ఆదేశాలకు అనుగుణంగా కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈ.ఓ యుద్ధప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేశారు.

  వీటిని సోమవారం ఆలయ ప్రాంగణాల్లో కలియదిరిగి పరిశీలించిన సీతారాం సంతృప్తిని వ్యక్తం చేశారు,ఉత్సవాలు జరుగుతున్న అన్ని రోజుల్లోనూ పిల్లలకు ఎటువంటి లోటు పాట్లు లేకుండా దేవస్థానం అధికారులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచనలు,ఆదేశాలు అమలు చేయడంలో పూర్తిగా సహకరించిన విశాఖ జిల్లా కలెక్టర్ కు,దేవస్థానం కార్య నిర్వహణ అధికారికి,పాలక మండలి చైర్ పర్సన్ కు పాలక మండలి సభ్యులకు సీతారాం అభినందనలు తెలిపారు.

   ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు ఎన్.సుబ్రమణ్యం,చైల్డ్ డెవలప్మెంట్ ప్రోజెక్ట్ ఆఫీసర్ రమణి కుమారి,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు సత్యవతి,భవాని,సీఆర్పీఎఫ్ రాష్ట్ర కో.కన్వీనర్ పి.శేఖర్,నగర కన్వీనర్ కె.ఎల్లయ్య,దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం