నగరిలో విద్యార్థులకు ట్యాబులు పంపిణి చేసిన మంత్రి ఆర్.కె.రోజా

తిరుపతి,2022డిసెంబర్27, టుడే న్యూస్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి  ఆర్.కె.రోజా నగరి పట్టణం లోని పి.సి.ఎన్. హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులను మంగళవారం పంపిణి చేశారు. ఈ సందర్బంగా జరిగిన  సమావేశంలో మంత్రి  మాట్లాడుతూ  వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి  మన ముఖ్యమంత్రి గా ఉండడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు.

గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా పిల్లలు చదువు కోవడానికి ఇబ్బందులు పడేవారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ విద్యా కంటెంట్ తో ట్యాబులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా    4,59,564 మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులు మొత్తం 5,18,740 మందికి ట్యాబు ల విలువ 688 కోట్లు మరియు బైజూస్ ఫ్రీ లోడెడ్ కంటెంట్  విలువ 778 కోట్లు మొత్తం 1,466 కోట్ల రూపాయలు వినియోగించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి విజయేంద్ర, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, కౌన్సిల్లర్లు, ఎంపిటీసీలు, సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, ఎంపీడీఓ, మండల విద్యాశాఖధికారి, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు, విద్యార్తులు,  వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*