రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని దంపతుల అభివాదం..
- * కాసాని కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించిన రాష్ట్రపతి 

హైదరాబాద్,2022డిసెంబర్,26 టుడే న్యూస్ : శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము గౌరవార్థం రాష్ట్ర గవర్నర్  తమిళసై సౌందర్యరాజన్ రాజభవన్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము కి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  కాసాని జ్ఞానేశ్వర్ దంపతులు పరిచయం చేసుకుని అభివాదం చేయడం జరిగింది. ఈ సందర్భంగా  కాసాని జ్ఞానేశ్వర్ తన సతీమణి  చంద్రకళ ని, తనయుడు సాయిని రాష్ట్రపతి ముర్ము కి పరిచయం చేశారు. దీంతో గౌరవ రాష్ట్రపతి గ కా సాని కుటుంబ సభ్యులను ఆప్యాయంగా చిరునవ్వు తో పలకరించారు. రాష్ట్రపతి ముర్ము  పక్కనే ఉన్న రాష్ట్ర గవర్నర్  తమిళసై సౌందర్యరాజన్ కి కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  కాసాని జ్ఞానేశ్వర్ దంపతులు నమస్కరించి అభివాదం తెలియజేయడం జరిగింది.

           ****      ***************     ****

 26.12.2022 రాష్ట్ర పార్టీ కార్యాలయం, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్  సమక్షంలో చార్మినార్ నియోజకవర్గం, లాల్ దర్వాజా డివిజన్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు ఎస్. నర్సింగా రావు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నర్సింగ్ రావు కి పార్టీ కండువా కప్పి పార్టీ లోనికి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ . ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ కూడా పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*