కెఎన్నార్ అందరివాడు,ఆయన వ్యక్తిత్వానికి పదవులే వెతుక్కుంటూ వస్తాయి..ఎంపీ జీవిఎల్*సామాజిక సేవ ఆయన నైజం

గాజువాక,2022, డిసెంబర్ 5, టుడే న్యూస్:-వ్యక్తిత్వం గొప్పదైతే ఆ వ్యక్తిని సమాజం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుంది అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.విశాఖ విమానాశ్రయ సలహా కమిటీ సభ్యుడిగా ఇటీవల నియమితులైన గాజువాక భాజపా కో ఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావుకు పార్టీ గాజువాక కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో సోమవారం ఆత్మీయ సత్కారం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ విశాఖ నగరానికే తలమానికంగా ఉన్న గాజువాక పట్టణంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో కేఎన్నార్ కృషి వెలకట్టలేనిదన్నారు.తొలినుంచీ సామాజిక సేవే ధ్యేయంగా సేవలందిస్తున్న ఆయన భాజపాలో చేరాక పార్టీకి ఈ ప్రాంతంలో పూర్వ వైభవం తీసుకువచ్చారని చెప్పారు.చేసిన సేవలు,మంచితనం ఎప్పుడూ వృధాగా పోదని అందుకు ఆయనకు లభించిన పదవే ఉదాహరణ అని అన్నారు.భవిష్యత్ లో మరిన్ని పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.కేఎన్నార్ మాట్లాడుతూ జీవీఎల్ విశాఖపట్నంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రతిపక్షాలు కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తరుణంలో కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ప్లాంట్ పురోభివృద్ధి,నిర్వాసితుల ఉపాధి,నిరుద్యోగ సమస్యలపై ఎప్పటికప్పుడు ఆయన స్పందిస్తున్న తీరు చాలా గొప్పదని పేర్కొన్నారు.బీజేపీ నాయకులు గూటూరు శంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణంరాజు,బాటా శ్రీనివాస్,శశిధరన్ పిళ్ళై,నాగేశ్వరరావు,గోలి శంకరరావు,64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ నాయకులు సోంబాబు ,బోండా ఎల్లాజీరావు ,పెంటయ్య , మాజీ కౌన్సిలర్ పేర్ల సత్య రావు ,జనసేన నాయకులు కాదా శ్రీను  ,ముసలయ్య ,కోసూరు తాతారావు  ,రోహిణి ,జిలకర భువనేశ్వరి ,కట్ట పద్మ ,అమ్మ బ్లడ్ బ్యాంక్ బాలు ,కిక్ భాక్సింగ్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గ ,అమ్మ చారిటబుల్ ట్రస్ట్ భాస్కర్ ,అయ్యల్ నాయుడు ,ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ యూత్ ,కళాకారుల సంఘం కార్యదర్శి లుక్స్ రాజు ,అడ్వకేట్ నాయుడు ,కళావతి ,సత్తిబాబు ,శ్రీరామ్ మూర్తి ,చందు తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం