ఐక్యతతతోనే హక్కులు సాధ్యం
*- జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయం*
- *కుటుంబ సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ అవసరం*
- *ఎస్సీఆర్డబ్ల్యూఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్*
- *కంచరపాలెం టూ పెందుర్తి యూనిట్ సభ్యులకు డైరీ,స్వీట్స్ పంపిణీ*
విశాఖపట్నం,2022 డిసెంబర్ 28,టుడే న్యూస్ : జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయమని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు..శుక్రవారం ఎన్ఏడి కొత్తరోడ్, చాప్సి రెస్టారెంట్ లో 99 టీవీ పాలికి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సిఆర్డబ్ల్యూఏ( *కంచరపాలెం టూ పెందుర్తి యూనిట్* ) సభ్యుల డైరీ,స్వీట్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అన్నారు..జర్నలిస్టులకు అండగా అసోసియేషన్ ఉంటుందన్నారు.. సంస్థ ఆవిర్భావం, సభ్యుల సంక్షేమం కోసం సంస్థ తరపున చేస్తున్న కార్యకలాపాలను
వివరించారు. నిరంతరం పాత్రికేయుల సంక్షేమం కోసం పరితపించే సంస్థగా వారి యోగ క్షేమాలు, కష్ట నష్టాల్లోనూ పాలుపంచుకుంటూ ఎప్పుడూ వెన్నంటే పాత్రికేయలతోనే ఉంటున్న సంస్థగా ఆయన చెప్పారు. ప్రతి జర్నలిస్ట్ ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలనేది అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి సుమారు 6 ఏళ్ళు అవుతొందన్నారు. ఈ ఆరేళ్లలో అసోసియేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.సభ్యుల సహాయ సహకారాలతో అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయడానికి అలాగే అసోసియేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టులు తమ తమ కుటుంబ సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాలని అన్నారు.
సీనియర్ పాత్రికేయులు విశాఖ టుడే మహేష్,అన్వేషణ నాయుడు,సతీష్ తదితరులు జర్నలిస్టుల సమస్యలపై ప్రసంగించారు.అనంతరం సభ్యులకు డైరీలు,మిఠాయిలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్(కిరణ్),ఉపాధ్యక్షులు పద్మజ,జాయింట్ సెక్రెటరీ వినోద్ ఇతర సీనియర్ పాత్రికేయులు ఉన్నారు..