13వ వార్డు పరిధిలో సచివాలయానికి అభివృద్ధి నిధులు 20 లక్షల రూపాయలు మంజూరిఅక్కయ్యపాలెం,2023 జనవరి 7, టుడే న్యూస్: విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో గల జీవీఎంసీ 13వ వార్డు పరిధిలో గల శివాజీ నగర్-1 స్థానిక కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణ  ఆధ్వర్యంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల హాజరై ప్రతిగడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో సచివాలయానికి అభివృద్ధి నిధులు 20 లక్షల రూపాయలు మంజూరి చేస్తున్నారని ఆ నిధులతో ప్రతి ఏరియాలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని నిజానికి జగనన్న ప్రభుత్వంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, సచివాలయ సిబ్బంది, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, ఆర్పీలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం