పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 3000/- జరిమానా విధించిన జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు

 **జిల్లా పోలీస్ కార్యాలయం, Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం.** ది. 04-01-2023.

🔹నేరము జరిగిన ఐదు నెలల లోనే ముద్దాయికి శిక్ష.

 *ఈరోజు పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 3000/- జరిమానా విధించిన జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు, కాకినాడ.* 

🔹మహిళలు, చిన్నారుల పై వేధింపులకు పాల్పడితే  కఠిన శిక్షలు తప్పవు 

🔹సత్ఫలితాలిస్తున్న “ట్రైల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణ"

2022 సంవత్సరం ఆగష్టు నెల 6 వ తారీఖున మధ్యాహ్నం సుమారు 03.00 గంటల ప్రాంతం లో 4 సంవత్సరముల  మైనర్ బాలికను ఇంటి బయట ఆడుకొంటూండగా ఆ బాలికకు చాక్లెట్ ఇచ్చి ఎత్తుకుని  *రమణ* అను వ్యక్తి ఇంట్లోకి తీసుకోని వెళ్లి లైంగిక దాడి కి పాల్పడ్డ సంఘటనలో, బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు Cr.No.198/2022 U/S  376 (2) (i), 376 (2) (n), 506 IPC, 3(2) (v) SC & ST POA Act, and Sec.5 (m) r/w 6 of POCSO Act-2012 కేసుగా మండపేట రూరల్ ఎస్‌ఐ బి. శివ కృష్ణ కేసు నమోదు చేయగా, రామచంద్రాపురం SDPO డి.బాల చంద్రారెడ్డి  సమగ్ర దర్యాప్తు చేపట్టి గౌరవ కోర్టు నందు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.

            **తదుపరి జరిగిన విచారణ నందు జిల్లా  పోక్సో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్ పితాని శ్రీనివాసరావు, ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించగా, గౌరవ పోక్సో స్పెషల్ కోర్ట్ జడ్జి  ఎల్ . వెంకటేశ్వర రావు, కేసు విచారణ అనంతరం, ముద్దాయి పై నేరం రుజువు అయినందున,  ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 3000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు

           ** ఈ కేసు  దర్యాప్తు లో నిందుతునికి  శిక్ష  పడడంలో  ప్రత్యేకంగా కేసు విచారణ జరుగుతున్న సమయంలో, కోర్టునకు హాజరై, కేసు విచారణ సమయములో ఏ విధమైన ఆలస్యం చేయకుండా సాక్షులను ప్రవేశపెట్టి, పి.పి కి అవసరమైన కేసు సంభందించిన రికార్డు లను సమకూర్చి, నేరస్తునికి శిక్ష పడడంలో ఎంతో కృషి చేసిన పోక్సో కోర్ట్ కో -ఆర్డినేటర్ గా ఉన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  G. గోవింద రాజు - Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా ని , ప్రాసిక్యూషన్ తరపున వాధించిన పోక్సో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యుటర్  పితాని శ్రీనివాసరావు ని, దర్యాప్తు అధికారి అయిన  డి .బాల చంద్రారెడ్డి, SDPO, రామచంద్రాపురం ని, మరియు ఈ కేసు ట్రైల్ ప్రాసెస్ ను ఎప్పటికప్పుడు మానిటర్ చేసిన మండపేట రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. శివ గణేశ్ ని, మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బి. శివ కృష్ణ ని మరియు  పోక్స్ కోర్టు లైజన్ హెడ్ కానిస్టేబుల్  K.కోటేశ్వరరావు HC- 2975, మరియు పోక్సో కోర్టు  కానిస్టేబుల్ K. వెంకటరెడ్డి, HC.3843 - మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ లను Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ  ప్రత్యేకముగా అభినందిచారు.*

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం