విశాఖలో మొట్టమొదటి థియేటర్‌ ఫెస్ట్‌ జనవరి 21`22 తేదీలలో

 


విశాఖపట్నం 4, జనవరి, 2023, టుడే న్యూస్ : లిట్‌ లాంటర్న్‌ ఫర్‌ కల్చర్‌ Ê లిటరేచర్‌ వెల్ఫేర్‌ సొసైటీ, రిజిష్టర్డ్‌ నాన్‌ ప్రాఫిట్‌ సొసైటీ, విశాఖపట్నంలో తన వైజాగ్‌ జూనియర్‌ థియేటర్‌ ఫెస్ట్‌ ప్రారంభ ఎడిషన్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కు విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయాలు కలిగి ఉన్న కార్పోరేట్‌ సంస్ధలు దేవీ సీ ఫుడ్స్‌ లిమిటెడ్‌, నెక్కంటి సీ ఫుడ్స్‌, నంధ్యా మెరైన్‌ లిమిటెడ్‌, సి.ఎం.ఆర్‌ షాపింగ్‌ మాల్‌ సంస్ధలు, వినానా హెటల్‌, కంకటాల, వైభవ్‌ జ్యూయలర్స్‌ మరియు ఐడియా ఫస్ట్‌ల మద్దతుతో నిర్వహిస్తున్నాయి. ఇది కేవలం పిల్లల కోసం మాత్రమే నిర్వహించబడే రాష్ట్రంలో మొట్టమొదటి థియేటర్‌ ఫెస్ట్‌.

ఈ ఫెస్ట్‌ 4 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల కోసం తయారు చేయబడిరది.రెండు రోజులలో4 థియేటరు ప్రదర్శనలు, ప్రతి నాటకానికి ముందు ప్రారంభ ప్రదర్శనలు మరియు 6 వర్క్‌ షాపులను నిర్వహిస్తారు. ప్రొఫెషనల్‌ థియేటర్‌ ట్రూప్స్‌ బర్డ్‌ ఆఫ్‌ ఎ ఫెదర్‌ (డిల్లీ నుండి) గిల్లో రిపర్టరీ థియేటర్‌ (ముంబయి నుండి) మరియు సుప్రసిద్ధ స్పానిష్‌ క్లౌన్‌ మోనికా శాంటోప్‌ గారు ఈ ఫెస్ట్‌ లో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ప్రదర్శకులు వర్క్‌ షాపులను కూడా నిర్వహిస్తారు.

విజెటిఎపఫ్‌ 21 జనవరి 2023 (శనివారం) మరియు 22 జనవరి 2023 (ఆదివారం) తేదీలలో సిరిపురంలోని విఎంఆర్‌డిఏ ఛిల్డ్రన్స్‌ ఎరీనాలో నిర్వహించబడుతుంది. ఈ ఈవెంట్‌ పిల్లలు మరియు వారి తల్లిదండ్రులతో కలసి రంగస్ధల కళాకారులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పించడంతోపాటు వర్క్‌షాపుల ద్వారా రంగస్ధల నిర్మాణాల యొక్క వివిధ కోణాలను నేర్చుకుంటారు.

ఘోస్ట్‌ ఆఫ్‌ ది మౌంటైన్‌ 7 సంవత్సరాలు పైబడిన పిల్లల కోసం మరియు అడ్వెంచర్స్‌ ఆఫ్‌ తారా 4 సంవత్సరాల పైబడిన పిల్లల కోసం నిర్వహిస్తారు.

ఈ ఈవెంట్‌ కొరకు ప్లే టికెట్‌ ధర రూ.150 మరియు వర్క్‌షాపు టికెట్‌ ధర రూ. 200 కే, విఐపి రోడ్‌లోని తనిష్క్‌ షోరూంలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఈవెంట్‌ మరియు నాటకాలకు సంబంధించిన వివరాలు ....... ఫేస్‌బుక్‌ పేజి.......... మరియు ఇన్‌స్టాగ్రాం పేజి.....లో అందుబాటులో ఉంటాయి.

ఆసక్తిగల విద్యార్ధులు, తల్లిదండ్రులు, పాఠశాలలు ప్రియా 9866628484 సోనల్‌ 9985122022 లేదా సంధ్య 9849117400 ని సంప్రదించవచ్చు లేదా ....... కు ఈ మెయిల్‌ పంపవచ్చు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు