కుప్పంలో టిడిపి కార్యకర్తలపై లాఠీఛార్జిని ఖండించిన బక్కని నర్సింహులు


  హైదరాబాద్,2023 జనవరి4,టుడే న్యూస్: చికటి జీవోలిచ్చినవాళ్లంతా చీకట్లోనే కలిసిపోయారు. 

జగన్ రెడ్డి చీకటిపాలనకు త్వరలోనే చరమగీతం..

-ప్రకటనలో ధ్వజమెత్తిన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు

మాజీ ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యుడు  నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా మంగళవారం కుప్పంలో యుద్ధ వాతావరణం సృష్టించడం ఏపిలో పాసిస్ట్ పాలనకు అద్దం పడుతోంది. 

నియోజకవర్గంలో పర్యటించనీకుండా  స్థానిక శాసనసభ్యుని, అందునా మాజీ ముఖ్యమంత్రికి అడ్డంకులు కల్పించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. 

చీకటి జీవోలతో జగన్ రెడ్డి చీకటిపాలన చేస్తున్నారు. ఇలాంటి చీకటి జీవోలిచ్చిన సీఎంలు గతంలో చీకట్లోనే కలిసిపోయారు. 

చంద్రబాబు హయాంలో వెలుగులు విరజిమ్మిన ఆంధ్రప్రదేశ్ గత మూడున్నరేళ్లలో చీకటిమయం అయ్యింది.  బంగారంలాంటి రాష్ట్రాన్ని చీకట్లో ముంచిన చరిత్ర జగన్ రెడ్డిదే. ఆంధ్రప్రదేశ్ లో చంద్రోదయాన్ని ఆపడం ఎవరి తరం కాదు. 

చంద్రబాబు పర్యటనలకు, సభలకు, రోడ్ షోలకు జనం నుంచి వస్తున్న స్పందన చూసి జగన్ రెడ్డి బెంబేలెత్తుతున్నారు, ఆ అక్కసుతోనే చీకటి జీవో తెచ్చారు.

‘‘వినాశ కాలే విపరీత బుద్ది’’..పోగాలం దాపురించబట్టే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. 

పచ్చటి పైర్లు, అమాయకమైన ప్రజలతో ప్రశాంతంగా ఉండే కుప్పంను ఉద్రిక్తమయం చేయడం బాధాకరం. మహిళలని కూడా చూడకుండా లాఠీఛార్జి చేయడం గర్హనీయం..

మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ప్రశాంతంగా జరిగేలా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు