సమస్యలు పరిష్కారం కోసం త్వరలో ఛలో ఢిల్లీ


*జర్నలిస్టు ల సంక్షేమమే పరమావధి*

 *సంక్రాంతి ఆనందో త్సాహాలు తేవాలి*

అక్కయ్య పాలెం,2023 జనవరి 13, టుడే న్యూస్ :

జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ లు సంక్షేమానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషీ చేయడం జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు తెలిపారు.. శుక్ర వారం ఇక్కడ అక్కయ్య పాలెం ప్రధాన జంక్షన్ లో ఉన్న ఒక ప్రైవేటు కార్యాలయం లో సంక్రాంతి పండుగ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు 600 కేజీ లు కొత్త బెల్లం( ఏటువంటి రసాయనాలు మిళితం కానీ),సింహాచలం కాలెండర్ లు అందచేశారు... ఈ సందర్భముగా గా శ్రీను బాబు మాట్లాడుతూ త్వరలో ఢిల్లీ వేదికగా 13 రాష్ట్రాల జర్నలిస్ట్ ల అసోసియేషన్ లతో

ప్రత్యేక సమావేశము జరగ నుందన్నారు.. ఆ సమావేశంలో జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ లు కు సంబంధించి పలు సమస్యలని పరిష్కరించాలని కోరడం జరుగు తుంది అని, అందుకు తగ్గట్లు గా అవసరమైన తీర్మానాలు అప్పుడే చేస్తామన్నారు..  రాష్ట ప్రభుత్వము

పరిదిలో సమస్యలు పరిష్కారం కోసం తగిన విజ్ఞాపనలు అంద చేయాలని నిర్ణయము తీసుకోవడం జరుగుతుందన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా మన్నారు..  ప్రతి యేటా  సంక్రాంతికి జర్నలిస్టులకు కొత్త బెల్లం ఇస్తున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 600 కేజీ లు  పంపిణీ చెయ్యడం జరుగు తుంది అన్నారు.  జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి సంవత్సరమూ, ప్రతి సందర్భంలోనూ తన వంతు సహాయ సహకారాలు అంద చేస్తున్నానన్నారు.. దసరా, దీపావళి, సంక్రాంతి.పండుగులు, విద్య, వైద్యం, క్రీడలు ఇలా అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు..సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*