మంత్రి అమర్నాథ్ ఇంట ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు
-- భోగి వేడుకల్లో పాల్గొన్న అమర్నాథ్ కుటుంబ సభ్యులు
విశాఖపట్నం, 2023 జనవరి 14, టుడే న్యూస్ : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం భోగి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి ప్రతి కుటుంబంలోనూ ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. తాను మంత్రిని అయిన తర్వాత జరుగుతున్న తొలి పండుగ ఇది అని అమర్నాథ్ చెబుతూ రాష్ట్రంలో పేద, గొప్ప అనే తారతమ్యం లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను అందజేస్తున్నారని, వీటి వలన పేదరికం చాలావరకు తగ్గిందని ఆయన అన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవడంతో రైతుల ఆనందంగా ఉన్నారని ఆయన చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు మరింత సుభిక్షంగా ఉంటారని మంత్రి అమర్నాథ్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.