సత్యదేవ్ సేవలు సమాజంలో ఎంతో విలువైనవి
విశాఖపట్టణం,2023 జనవరి 27, టుడే న్యూస్:
సమాజంలో వివిధ రంగాలద్వారా గత నలభై అయిదు సం॥ కు పైగా ప్రజా సత్సంబంధాల నేపధ్యంలో నిస్వార్ధంగా సేవలనందిస్తున్న
చింతలపాటి సత్యదేవ్ సేవలు
విలువైనవని, ఆయన జీవన శైలి
ఆదర్శనీయమని
సెంచ్యూరియన్ యూనివర్సిటీ
వైస్ ఛానల్స్‌ర్ ఫ్రొఫెసర్
జి. యస్.యన్. రాజు
కొనియాడారు .
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్టణం ఛాఫ్టర్ దస్పల్లా హోటల్‌లో శుక్రవారం
" బెస్ట్ పబ్లిక్ రిలేషన్స్ మేన్ " అనే అవార్డును ఇచ్చి ఘనంగా సత్యదేవ్‌ను సన్మానించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గని ప్రసంగించారు .
ఆధ్యాత్మిక
జీవనానికి నికి,
సామాజిక సేవకు
ఆయన అంకితమై జీవించడమనేది అరుదైన విషయమన్నారు.
సమాజంలో సత్సంబంధాలు ఉంటే మహత్కార్యాలు చేయవచ్చునడానికి
సత్యదేవ్ ఒక ఉదాహరణ మన్నారు సెంచ్యూరియన్ యూనివర్సిటీ
వైస్ ఛాన్సలర్
జి. యస్. యన్. రాజు
సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం ఫ్రొఫెసర్
డి. వి. ఆర్.మూర్తి మాట్లాడుతూ
సత్యదేవ్ జీవన విధానంలో, ఆయన రచనలలో గురుదేవులైన మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య ప్రస్ఫుటంగా గోచరిస్తుందన్నారు .
ప్యభుత్వ అధికారులతో , అనేక సంస్ధలతో తనకున్న సత్సంబంధాలను సంఘుసేవకే వినియోగించడ మనేది ఆయన నిస్వార్ధానికి సంకేతమన్నారు .
అవార్డ్ గ్రహీత చింతలపాటి సత్యదేవ్ మాట్లాడుతూ
స్వధర్మాచరణ , ఆధ్యాత్మిక దృక్పధం, సంఘపరమైన సన్మార్గాన్ని చూపించిన మాస్టర్ ఇ. కె తనకు మార్గదర్శకులని అన్నారు. జగద్గరు పీఠం, కులపతి బుక్ ట్రస్ట్ , జనకులం ఫౌండేషన్ తదితర సంస్ధల ద్వారా తానందిస్తున్న సేవలు సంతృప్తి నిస్తుంటాయన్నారు.
మాస్టర్ పార్వతీకుమార్ మార్గదర్శకత్వంలో నిర్మాణం చేయబడ్డ
మాస్టర్ ఇ. కె సుందరవనం,
బాలభాను విద్యాలయం, మాస్టర్ ఇ. కె సంస్కతి సదన్ వంటి సంస్ధలకు తాను ప్రభుత్వ నుండి స్ధలాలను సేకరించడమనేది
తన జీవితంలో
మరపు రానిదన్నారు. సద్గురువుల అనుగ్రహ కారణంగా తాను నాలుగు దశాబ్దాలుగా సేవల నందివ్వడం తనకు
ఆనందిస్తుందన్నారు .
సభకు అధ్యక్షత వహించిన
పబ్లిక్ రిలేషన్న్ సొసైటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఛాప్టర్ అధ్యక్షుడు
పి. యల్. యన్. మూర్తి మాట్లాడుతూ
సమాజంలో విశిష్టమైన సేవల నందిస్తున్న వారిని గుర్తించి ఇలాంటి అవార్డులను
సమర్పిస్తుంటామన్నారు. సాహిత్య , సాంస్కృతిక , ఆధ్యాత్మిక ,
సామాజిక రంగాల ద్వారా సత్యదేవ్ చేస్తున్న కృషి అభినంద నీయమన్నారు .
సభలో వైస్ ఛాన్సలర్,
సొసైటీ కార్యవర్గ సభ్యులు సత్యదేవ్ కు ఈ అవార్డ్ నిచ్చి
ఘనంగా సత్కరించారు .