ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు తెలిసేలా చేయండి : కె కె రాజు


అక్కయ్యపాలెం,2023 జనవరి 3, టుడే న్యూస్: విశాఖ, ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం షాదీ ఖానా కళ్యాణ మండపంలో 14,24,25,26,42,43,44,45,55,వార్డులకు సంబంధించిన సచివాలయ కన్వీనర్లు మరియు వార్డు వాలంటీర్లతో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె కె రాజు  సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కె కె రాజు  మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం  ప్రజలు ముంగిటకే పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకుండా స్వయంగా చేరాలని సదుద్దేశంతో సచివాలయ వ్యవస్థ మరియు వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగిందని తద్వారా ప్రజలకు అనేక విధాలుగా లబ్ధి చేకూరిందని అన్నారు.  వైస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఎటువంటి అవినీతి తావు లేకుండా ప్రతి ఒక్క లబ్ధి దారుడికి DBT ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్స్ లోకి జమ చేయడం జరిగింది అని అన్నారు. అలాగే   మన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ది పనులను ప్రజల దృష్టికి తీసుకువెళ్లానని తద్వారా వచ్చే ఎన్నికల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ని రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చిక్కాల రామారావు,డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హునుక్,స్టాండింగ్ కమిటీ మెంబర్ సారిపిల్లి గోవింద్,కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు,సాడి పద్మారెడ్డి,ఆళ్ళ లీలావతి శ్రీనివాస్, ఉషశ్రీమాజీ కార్పొరేటర్ బాక్సర్ రాజు,పోతుసత్యనారాయణ,జి.వి రమణి,పీలా వెంకటలక్ష్మీ పైడి రమణ, అబ్బీబ్,సీనియర్ నాయకులు,డైరెక్టర్లు,బూత్ కన్వీనర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం