యువశక్తి సభను విజయవంతం చేయండి: పితాని బాలకృష్ణ పిలుపు



శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ నెల 12 జన సేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యువశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ముమ్మిడివరం నియోజక ఇంఛార్జి పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

ముమ్మిడివరం జనసేనపార్టీ కార్యాలయంలో  ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉదయం నుండి సాయింత్రం వరకు జరగబోయే జనసేన పార్టీ యువశక్తి  కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గం నుండి భారీగా యువత తరలి వచ్చి యువ శక్తి కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జనసేనపార్టీ కార్యాలయం లో యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో గుద్దటి జమి ,  జక్కం శెట్టి బాలకృష్ణ, గొల్ల కోటి వెంకన్నబాబు,  మద్దింశెట్టి పురుషోత్తం, మోకా బాల ప్రసాద్, అత్తిలి బాబురావు, ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, నూకల దుర్గబాబు, పిల్లి గోపి పెన్నాడ శివ ,పితాని శివ, ఎంపీటీసీ జమి,బీమాల సూర్య నాయుడు, గేదెల స్వరూప్ దూడల స్వామి,కడలి కొండ, వంగ విజయ్, సీతారాం ,లేటి గోపీ  తదితరులు హాజరయ్యారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం