క్రీడలు, ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం, ఉల్లాసంగా ఉత్సాహంగా జర్నలిస్టుల క్రీడలు
బ్రహ్మ కుమారీస్ 2023 కాలెండర్ ఆవిష్కరణ

అక్కయ్య పాలెం,2023 జనవరి 4, టుడే న్యూస్ :

సమాజములో ప్రతీ ఒక్కరూ తమ దైనందన జీవితంలో ఎంత పని ఒత్తిడితో ఉన్నప్పటికీ కొంత సమయం క్రీడలు, వ్యాయామం ధ్యానానికి కేటాయించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని మహావిశాఖ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ యాదగిరి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఇక్కడ పోర్టు  స్టేడియంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా 

 పలు ఇండోర్ ఆటలు పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజాభివృద్ధి కోసం పాటుపడుతున్న జర్నలిస్టులు క్రమం తప్పకుండా క్రీడలు నిర్వహించుకోవడం ప్రశంసనీయమన్నారు. గౌరవ అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ అధ్యక్షులు సుఖీభవ శర్మ మాట్లాడుతూ

సమాజానికి  అందరు ఏదో ఒక రూపంలో తమ వంతు సేవలు అందించాలన్నారు. ఆ దిశగా జర్నలిస్టులు పాటుపడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ప్రశంసలు అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన  ఫోరమ్ అధ్యక్షులు గంట్ల  శ్రీను బాబు మాట్లాడుతూ పది రోజులు పాటు జర్నలిస్టుల క్రీడలను అత్యంత ఘనంగా నిర్వహించను న్నట్లు చెప్పారు. నేటి నుంచి క్రికెట్ పోటీలు ప్రారంభం అవుతాయన్నారు .

కార్యదర్శి దాడి రవికుమార్ ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్ తదితరులు మాట్లాడుతూ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం తమ సభ్యులకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారురెండో రోజు షటిల్ బ్యాడ్మింటన్, కేరమ్స్, చెస్, టేన్ని కాయట్ పొటీలు నిర్వహించారు.

బ్రహ్మకుమారిస్2023 క్యాలెండర్ ఆవిష్కరణH

బ్రహ్మకుమారీస్  ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 2023 వార్షిక క్యాలెండర్ ను సంస్ధ ప్రతినిధి

 బి కే రామేశ్వరి ఆధ్వర్యంలో  అదనపు కమిషనర్ యాదిగిరి శ్రీనివాస్, రోటరీ అధ్యక్షులు శర్మ

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్ష, ఉపాధ్యక్షులు

గంట్ల శ్రీనుబాబు ,ఆర్ నాగరాజు పట్నాయక్

స్పోర్ట్స్ జర్నలిస్టులు అసోసియేషన్ అధ్యక్షులు ఉమా శంకర్ బాబు లు చేతులు మీదుగా

అవిష్కరించారు..

ఈ సందర్భంగా బీకే రామేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి భావంతో ముందుకు సాగాలన్నారు.

అశాంతి లోనే శాంతి కలిగి ఉంటుందని

కాబట్టి జర్నలిస్టులు దయనందన జీవితంలో కొంత ఆధ్యాత్మికత ధ్యానం కూడా అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఫోరమ్ సబ్యులు ఈశ్వర రావు, గిరిబాబు, ఎమ్మెస్సార్ ప్రసాద్,వరలక్ష్మి, దివాకర్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు