జర్నలిస్టులు నిరంతర విజేతలు

 *పాత్రికేయులు పోరాట యోధులు

*ఉల్లాసంగా ఉత్సాహంగా జర్నలిస్టుల క్రీడా సంబరాలు*

అక్కయ్య పాలెం, 2023 జనవరి 6, టుడే న్యూస్ :

సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడే జర్నలిస్టులకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని వారు ఎప్పుడూ నిరంతర విజేతలే నని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా శుక్రవారం నాటి క్రికెట్ పోటీలకు జడ్పీ చైర్పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ విజేతలు ఎవరైనప్పటికీ ఒకే విధంగా భావించాలన్నారు. గెలిచిన జట్టు ఎక్కువ , ఓడిన వారు తక్కువేమీ కాదన్నారు.. ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. సమాజం కోసం పాత్రికేయులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. జర్నలిస్టులు కూడా క్రమం తప్పకుండా క్రీడలు నిర్వహించుకోవడం  ఎంతైనా అవసరమన్నారు. క్రీడలు వల్ల శారీరక దేహదారుడ్యముతో పాటు మానసిక ప్రశాంతత  లభిస్తుంది అన్నారు. తాను కూడా చిన్నప్పటినుంచి అనేక ఆటలు పోటీల్లో పాల్గొని ఎప్పుడు విజేతగా ముందు వరుసలో నిలిచేదాన్ని అని సుభద్ర ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ నిర్వహించే కార్యక్రమాల్లో తనను కూడా తప్పకుండా భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. ప్రజాప్రతినిధులుగా తమ వంతు సహకారం  జర్నలిస్టులకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి మాట్లాడుతూ జర్నలిస్టుల క్రీడల్లో తాను కూడా పాల్గొ నడం ఎంతో ఆనందం కలిగించింది అన్నారు. జర్నలిస్టుల వల్ల ప్రజా సమస్యలు

పూర్తిగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది అన్నారు. నిరంతరము 

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫోరమ్  అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ సభ్యులు సంక్షేమమే లక్ష్యంగా తమ పాలక వర్గం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు

ఇందులో భాగంగానే క్రమం తప్పకుండా ప్రతి ఏట  జర్నలిస్టుల క్రీడలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల మూడు నుంచి 12 వరకు జర్నలిస్టుల క్రీడా సంబరాలను ఘనముగా  నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంబరాల్లో ప్రజా ప్రతినిదులను, అధికారులను దశలవారీగా భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.

ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలోకార్యదర్శి  దాడి రవికుమార్ , కోశాధికారి నారసింహ మూర్తి,స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఉమా శంకర్ బాబు, ఉపాధ్యక్షులు పిటిఐ భాస్కర్ కోశాధికారి పైలా భాస్కర్,

వి జె ఎఫ్ కార్యవర్గ సభ్యులు ఎమ్మెస్సార్ ప్రసాద్ , పి.వరలక్ష్మి, డి. గిరి బాబు, పి. దివాకర్, గయాజ్

తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులు ను ఉత్సాహపరిచారు. వీరిని విజేఎఫ్,

విస్జా కార్య వర్గ సభ్యులు ఘనము గా సత్కరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు