అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు





కొత్త వై.యస్.ఆర్ పింఛన్ లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న - కె.కె రాజు  

అక్కయ్యపాలెం, 2023 జనవరి 4, టుడే న్యూస్:  విశాఖ ఉత్తర నియోజకవర్గం 14,24,25,26,42,43,44,45,46,55 వార్డులకు సంబంధించి అర్హులైన *629మందికి* కొత్త వై.యస్.ఆర్ పింఛన్ లు పంపిణీ కార్యక్రమం అక్కయ్యపాలెం,సాది ఖానా కల్యాణ మండపంలో నిర్వహించారు ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్  కె.కె రాజు  పాల్గొని వారి చేతులు మీదుగా అర్హులకు పింఛను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా  కె.కె రాజు  మాట్లాడుతూ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ పారదర్శకంగా,ఎవరి ప్రమేయం లేకుండా,కులాలకు,మతాలకు,రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి సంకేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని, గతంలో పింఛన్ మంజూరు కావాలంటే పింఛన్ తీసుకుంటున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే గాని, క్రొత్త  వారికి  పింఛన్ ఇచ్చేవారు కాదని నేడు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తున్నామని అన్నారు.

ర్రాష్ట్ర అభివృద్ధి,అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నిజాయితీగా అహర్నిశలు కష్టపడుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు *గౌ"  వై.యస్ జగన్మోహన్ రెడ్డి కి* అండగా మీరు అందరూ నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,జీవీఎంసీ జోనల్ కమిషనర్లు ఆర్.జి.వి కృష్ణ,విజయ లక్ష్మి,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్,స్టాండింగ్ కమిటీ మెంబర్ సారిపిల్లి గోవింద్,కార్పొరేటర్లు సేనాపతి అప్పారావు,కె.అనిల్ కుమార్ రాజు,సాడి పద్మారెడ్డి,ఆళ్ల లీలావతి, శ్రీనివాస్,పి.ఉషశ్రీ,కె.వి.యన్ శశికళ,APDలు పద్మావతి,దుర్గాప్రసాద్,వార్డు అధ్యక్షులు పీలా వెంకట లక్ష్మీ,జి.వి రమణి,పైడి రమణ,కె.పి రత్నాకర్,సీనియర్ నాయకులు,రాష్ట్ర డైరెక్టర్లు,అనుబంధ సంఘాల అధ్యక్షులు&సభ్యులు, సచివాలయం కన్వీనర్లు,కార్యకర్తలు,సీఓ లు,సచివాలయం సిబ్బంది,వాలంటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం