నూతన సచివాలయ మరియు అంగనవాడి కేంద్రం భవనం ప్రారంభోత్సవం

 



 అక్కయ్యపాలెం,2023జనవరి 7,టుడే న్యూస్: విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు అక్కయ్యపాలెం,ముస్లిం తాటిచెట్లపాలెంలో *నలబై ఐదు లక్షల ఎనబై ఐదు వేలు రూపాయల* వ్యయంతో 1086239సచివాలయం మరియు అంగనవాడి కేంద్రం నూతన సామాజిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మేయర్  హరి వెంకటకుమారి గారు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు  మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్,44వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు  పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా  కె.కె రాజు  మాట్లాడుతూ *గౌరవ  వై.యస్ జగన్మోహన్ రెడ్డి * ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజల ముందుకే అందాలనే సదుద్దేశంతో గ్రామ/వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని అన్నారు.

ప్రజలకు సంక్షేమ ఫలాలతో పాటు మౌలిక వసతులు కూడా కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని అలాగే ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండే విధంగా సచివాలయ నూతన భవనాలను కూడా నిర్మిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు,సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు సప్పంగి శ్రీనివాస్,హాబీబ్,హీర,షోఫియ,శ్యామలదేవి,సీతారాం,యం.గోపి,పి.గోపి,సుధాకర్ రెడ్డి,ఆదినారాయణ,బషీర్,ఆర్పీలు లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం