పబ్లిక్ రిలేషన్స్ సోసైటి ఆఫ్ ఇండియా, విశాఖపట్నం చాప్టర్

 


విశాఖపట్నం, 26 పిబ్రవరి, 2023, టుడే న్యూస్ :

జి20 సమావేశాలతో పెరగనున్న భారత ప్రతిష్ఠ

పి.ఆర్.ఎస్.ఐ. సమావేశంలో ఆర్థిక నిపుణులు

అభివృద్ధి చెందుతున్న దేశాలకు , అభివృద్ధి చెందిన దేశాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రపంచ ఆర్థిక గమనంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశం త్వరలో ఆతిద్యం ఇవ్వనున్న జి20 సమావేశాల ద్వారా తన ప్రతిష్ఠ ను మరింతగా పెంచుకోనున్నదని ప్రముఖ ఆర్థిక మరియు అంతర్జాతీయ నిపుణురాలు, గీతం విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధా రఘరామ పాత్రుని పేర్కొన్నారు. భారత ప్రజాసంబంధాల  సంఘం (పి.ఆర్.ఎస్.ఐ) ఆధ్వర్యంలో ఆదివారం తేది.26.02.2023న ( దశపల్లా  హోటల్,  సూర్య భాగ్) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జి20 భారతదేశ పాత్ర అవకాశాలు అనే అంశంపై ఆమె ప్రసంగించారు. కోవిడ్, ఉక్రెయిన్ యుద్దం వంటి అంశాల వల్ల ఆహర, ఇంధన సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని ఈ స్థితిలో అటు సంపన్న దేశాలతో ఇటు వర్థమాన దేశాలతో సత్సంబంధాలు ఉన్న భారతదేశం నుంచి ప్రపంచం చాలా ఆశిస్తోందన్నారు. జి20 దేశాల మధ్య గల విభేదాల వల్ల కూటమి పై సన్నగిల్లిన విశ్వసనీయతను ఈ ఏడాది దేశంలో జరిగే సమావేశాల ద్వారా భారతదేశం పునరుద్దరించాల్సి ఉందని ఆమె అభిప్రాయ పడ్డారు. జి20 ని నిర్వహించడం దౌత్యపరమైన లాంఛనం కాదని ప్రపంచం భారతదేశం పై పెట్టుకున్న నమ్మకమని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పి.ఆర్.ఎస్.ఐ. విశాఖ శాఖ ఛైర్మన్ డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం ప్రాతినిద్యం వహిస్తున్న జి20 కూటమి దేశాలు ఈ ఏడాది సెప్టెంబర్ 9.10 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం కావడం దానికి ముందుగా దేశంలోని వివిధ పట్టణాలలో 32 భిన్న అంశాలపై 200 సమావేశాలు నిర్వహించడం చారిత్రాత్రకం అన్నారు. మహిళా సాధికారికత, డిజిటల్ సదుపాయాలు, పర్యావరణ అంశాలు, ప్రపంచ ఆహర భద్రత, సాంకేతిక అభివృద్థి అంశాలను జి20 సమావేశాలలో చర్చించాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. 

పి.ఆర్.ఎస్.ఐ. విశాఖ శాఖ కార్యదర్శి ఎ.గోవిందరావు మాట్లాడుతూ భారతీయ వేదాల నుంచి స్ఫూర్తి పొందుతూ వసుదైవక కుటుంభకం నినాదంతో జరుగుతున్న జి20 సమావేశాలలో తీసుకునే నిర్ణయాలు ప్రపంచ మానవాళి ప్రగతికి ఉపయెాగపడగలవన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో 

ఆంధ్ర విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య డి వి ఆర్ మూర్తి, 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్,  ఆర్ పి శర్మ,  

గీతం విశ్వవిద్యాలయం పిఆర్ఓ ఎన్ వి నరసింహం, బి వి విజయ ప్రసాద్,  వై. ప్రభాకర్,  జోసెఫ్ రత్న కుమార్ మరియు 

 వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రజా సంబంధాల అధికారులు పాల్గొన్నారు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు