ఘనంగా మాడుగుల కేజే.పురం శ్రీ సంతోషిమాత తీర్థ మహోత్సవంమాడుగుల,2023 ఫిబ్రవరి26,టుడే న్యూస్: మాడుగుల మండలంలో కేజే పురం జంక్షన్లో కొలువైన శ్రీ సంతోషిమాత అమ్మవారి తీర్ధ మహోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల అమ్మతల్లి నాయుడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగ నిర్వహించారు. అమ్మవారి తీర్ధం పురస్కరించుకొని గోపూజ, అమ్మవారికి అర్చనలు, కుంకుమ పూజలు, విశేష అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. వేకువ జాము నుండే అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు, మొక్కబడులు సమర్పించుకున్నారు. మధ్యాహ్నం సుమారు ఆరు వేల మంది భక్తులకు అన్న సమారాధనలో పాల్గొన్నారు. సాయంత్రం తీర్థం మహోత్సవంలో జబర్దస్త్ ఆర్టిస్టులతో ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమం, సాంసుకృతిక కార్యక్రమాలు, చిటికెల భజనలు, కొలాటాలు, చూపరులను ఎంత గానో అలరించాయి. ఈ తీర్ద మహోత్సవానికి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మంత్రి  కుమార్తె అనురాధ, పైలా ప్రసాద్, విజయనగరం డిఎస్పి వేగి వెంకట అప్పారావు, పలువురు ప్రముఖులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి తీర్ధ ప్రసాదములు స్వీకరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు