వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం


*ఎస్ సి విభాగం జోనల్ ఇంచార్జి అల్లంపల్లి రాజబాబు*

విశాఖపట్నం,,2023 నవంబర్6, టుడే న్యూస్:      ,దళితుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసిపి ఎస్ సి విభాగం జోనల్ ఇంచార్జి అల్లంపల్లి రాజబాబు పేర్కొన్నారు. ఎండాడ లా కాలేజీ రోడ్డులో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరేటి మహేష్ అనే వ్యక్తి యువతను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నుంచి దళితులు రాజీనామా చేయాలని మహేష్ వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టారు. ఏయూలో చదువు కోసం వచ్చిన మహేష్ దళిత నాయకుడిగా ఎదిగి దళితులనే విమర్శించే స్థాయికి రావడం సిగ్గుచేటు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేస్తున్న పార్టీ వైసీపీ అన్నారు. అటువంటి పార్టీని, నాయకులను విమర్శించే స్థాయి మహేష్ కి లేదన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దళితులందరికీ సముచిత న్యాయం దక్కుతుందన్నారు. మంత్రివర్గంలో కూడా దళితులకు ముఖ్య శాఖలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మహేష్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు దళితులకు అన్యాయం జరుగుతుందని నిరసన చేపట్టడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా మేలుకొని దళితులకు న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ లు రెయ్యి వెంకటరమణ, కేవీ శశి కళ,డాక్టర్ బంగారయ్య, ఎస్ సి విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్