సింహాచలంలో వరుణయాగం
*పవిత్ర జలాలతో త్రిపురాంతకస్వామి కి అభిషేకం*
సింహాచలం,2023 నవంబరు 29
, టుడే న్యూస్ :
రాష్ట్రము లో సమృద్దిగా వర్షాలు కురవాలని సింహగిరి పై వరుణ యాగం అత్యంత వైభవంగా చేపట్టారు.. ఈ మేరకు బుధవారం,
సింహాచలేశుని ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ త్రిపురాంతక స్వామివారి దేవాలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు.ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం జరిపించారు. వైదికులంతా గంగధారకు వెళ్లి పవిత్ర జలాలను తీసుకువచ్చి మూలవిరాట్ నీ అభిషేకించారు. స్వామివారికి అర్చన చేసి వైదికులు, అధికారులు మరోసారి గంగధారకు వెళ్లి పూర్ణకలశతో ప్రకృతి జలాలను తీసుకువచ్చి త్రిపురాంతకుడ్ని అభిషేకం చేశారు. మంగళ నీరాజనాలు సమర్పించారు.కార్యక్రమంలో ఈఓ ఎస్.శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ
ఈ యాగము తో విస్తారము గా వర్షాలు కురవాలని ఆకాంక్ష వ్యక్తం చేసారు..అంతే కాకుండా కార్తీక మాసం లో వరుణ యాగం చేపట్టడం ఎంతో శుభ పరిణామం అన్నారు..త్రిపురాంతక స్వామి ఆలయం లో జరిగే అన్ని ఉత్సవాలు లో భక్తులును మరింతగా
బాగ స్వామ్యము చేయాలన్నారు.. అయా పూజా కార్య క్రమాలు లో ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు, బయ్యవరపు రాధ,ఏ ఈ ఓ లు పి నరసింగరావు, నారసింహరాజు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రమణమూర్తి ద్వయం, వేద పండితులు సురేష్, సుబ్రహ్మణ్యం , వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు