*న్యాయవాదులు ప్రజాస్వామ్య నిర్దేశకులు*




           - విశాఖ దక్షిణం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి రాము

విశాఖపట్నం,2024, మే 7,టుడే న్యూస్:       న్యాయవాదులు ప్రజాస్వామ్య నిర్దేశకులని, సామాజిక నిర్మాతలని ,ఈ దేశపు పునరుజ్జీవనంలో న్యాయవాదుల పాత్ర ఎంతో సంతరించుకుందని విశాఖపట్నానికి చెందిన న్యాయవాది, సంఘ సేవకుడు,మానవ హక్కుల కార్యకర్త, విశాఖపట్నం దక్షిణం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి రాము పేర్కొన్నారు.విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ,బార్ అసోసియేషన్ ఆవరణలో, న్యాయవాదులతో కలయిక కార్యక్రమంలో కదిరి రాము పాల్గొని న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా కదిరి రాము మాట్లాడుతూ,సాటి న్యాయవాది అయిన తనను ఎన్నికల బ్యాలెట్ సీరియల్ నెంబరు 1 లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, తన పాతికేళ్ళ న్యాయవాదాన్ని,రాజకీయ సంవాదాన్ని మేలవించి మెరుగైన సేవలందిస్తానని పేర్కొన్నారు. సామాన్యుల, మధ్యతరగతి ప్రజల రాజ్యాధికారమే లక్ష్యంగా, మాన్యశ్రీ కాన్షీరామ్ నేతృత్వంలో ఫూలే,అంబేద్కర్ ఆశయ సాధన మేరకు బీఎస్పీ  ఏర్పడిందన్నారు. న్యాయవాదులు ఉదాసీనంగా ఉంటే వ్యవస్థ నిర్వీర్య మవుతుందని, న్యాయవాదులు దేశ పూర్వ  వైభవానికి తిరిగి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించి చట్టసభలకు పంపించాలని న్యాయవాదులను కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బెవర సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి దంతి నరేష్ కుమార్ అధిక సంఖ్యలో న్యాయవాదులు  పాల్గొన్నారు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం